Publish Date:Apr 24, 2026
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది. దానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు.. ఎల్ అండ్ టీతో ఒప్పందం ఇప్పటికే పూర్తయ్యాయి. వాస్తవానికి మార్చి 31 నాటికి మెట్రో ప్రాజెక్ట్ ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వ పరం అయ్యేందుకు వీలుగా ప్లాన్ జరిగినప్పటికీ.. స్వాధీన ప్రక్రియకు అవసరమైన దాదాపు రూ.13,615 కోట్ల రుణం ప్రభుత్వానికి రాకపోవడంతో ఆలస్యమైంది. మెట్రో మొదటిదశ స్వాధీన ప్రక్రియకు అవసరమైన రుణాన్ని ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఓకే చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఒప్పందం.. డాక్యుమెంట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం పీపీపీ పద్దతిలో ఎల్ అండ్ టీ - తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టును పూర్తిగా టేకోవర్ చేసుకోవటానికి రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే.. స్వాధీన ప్రక్రియతో ముడిపడి ఉన్న పలు అంశాలు.. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిపార్సులను తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ఆమోదం తెలిపారు. ఐఆర్ఎఫ్ సీ ఇచ్చే దాదాపు రూ.13,615 కోట్ల రుణాన్ని 20 ఏళ్ల కాల వ్యవధిలో మెట్రో రైలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది. కీలక అంశం ఏమంటే.. ఐఆర్ఎఫ్ సీ తొలుత అంగీకరించిన రూ.12,750 కోట్ల కంటే తాజాగా రూ.13,615 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది.
ఐఆర్ఎఫ్ ఎసీ రుణంగా ఇచ్చిన మొత్తానికి అదనంగా ఇవ్వాల్సిన మొత్తాన్ని హెచ్ఎండీఏ ఇవ్వనుంది. ఈ మొత్తం తక్షణం అందజేస్తేనే గడువు లోపు లావాదేవీ పూర్తి అవుతుందని హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వాన్ని కోరగా.. ఈ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించారు. మెట్రో స్వాధీనం తర్వాత నిర్వాహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ ఉద్యోగులు 115 మందిని ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు అయ్యే వేతనాల ఖర్చును కూడా హెచ్ఎంఆర్ఎల్ భరిస్తుంది. అదే సమయంలో మెట్రో కార్యకలాపాలపై సూచనలు.. సలహాల కోసం ఆర్నెల్ల కాలానికి ఎల్ అండ్ టీకి చెందిన సీనియర్ ఎక్స్ పీరియన్స్ అధికారిస్థాయిలోని ఏడుగురి సేవల్ని ప్రభుత్వం తీసుకోనుంది. దీనికి అయ్యే ఖర్చును ఎల్ అండ్ టీ భరిస్తుంది. వివిధ దశలను దాటి.. ఫైనల్ గా హైదరాబాద్ మెట్రో ఈ నెలాఖరు నాటికి తెలంగాణ ప్రభుత్వ పరం కానుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/metro-in-the-hands-of-telangana-government-36-218189.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.