Publish Date:Apr 24, 2026
ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు. ముంబైలో శనివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం అమరావతి నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్తారు. 2.40 గంటలకు ముంబై విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5.25 గంటలకు వెన్యూ అయిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్తారు. రాత్రి 9.30 వరకు ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9.50 గంటలకు ముంబై నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
విప్లవాత్మక విధానాల అమలుకు దక్కిన గుర్తింపు
రేపు సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకూ జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా దిగ్గజ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఎకనమిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డు ను ముఖ్యమంత్రికి ప్రధానం చేయనుంది. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు లాంటి విప్లవాత్మక విధానాలు అమలుకు గాను ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డుకు సీఎం చంద్రబాబును ఎంపిక చేసింది. గతంలో అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, జై శంకర్ తదితర ప్రముఖులకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది.
సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్‌తో ఏపీకి పెట్టుబడులు
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు-పారిశ్రామిక అనుకూల పాలసీలు తీసుకు రావడంలో చంద్రబాబు పోషిస్తున్న పాత్రను ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ కొనియాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏపీకి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు రావడంలో విజయవంతం కావడం, పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తూ అమలు చేస్తున్న సంస్కరణలు, టెక్నాలజీ , ఇన్నోవేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన అనుభవంతో పాటు, ప్రస్తుతం అమరావతి, విశాఖపట్నం వంటి నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/business-reformer-of-the-year-award-36-218179.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.