ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఏది...?

Publish Date:Dec 5, 2012

Advertisement

 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరో నెల రోజుల వ్యవధిలో విడుదల అయ్యే అవకాశం ఉంది, ఇక సుకుమార్ తో సినిమా ఆ తర్వాత వస్తుంది. మరి ఆ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా ఏది? ఇకపై వేగంగా సినిమాలు చేస్తానని మాట ఇచ్చిన మహేశ్ బిజినెస్ మ్యాన్ తర్వాత మాట నిలుపుకోలేదు. ఆ సినిమా విడుదల అయిన ఏడాదికి కానీ మళ్లీ ప్రేక్షకులను పలకరించలేదు. మరి వరసగా రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉందిప్పుడు. ఆ రెండు విడుదలయిన తర్వాత మళ్లీ ఏడాది వరకూ మళ్లీ మహేశ్ సినిమా ఏదీ విడుదల అయ్యే అవకాశం కనపడటం లేదు.


ఎందుకంటే ఇప్పటి వరకూ తర్వాతి ప్రాజెక్టు విషయంలో కన్పర్మేషన్ లేదు. అయితే రూమర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. మహేశ్ బాబు, క్రిష్, అశ్వినీదత్ కాంబినేషన్ లో ఒక సినిమా రావొచ్చు అని అంటున్నారు. దాని పేరు ‘శివం’ అని ప్రచారం లో ఉంది. ఇంకా మహేశ్, శ్రీనువైట్ల కాంబోలో మరోసినిమా వస్తుందంటున్నారు. ఇది కూడా కాదంటే…మహేశ్ కొంచెం రిలీఫ్ కోసం ఒక బాలీవుడ్ పిక్చర్ చేసే యోచన కూడా ఉందట! మరి వీటిలో ఏది పట్టాలెక్కుతుందో!

By
en-us Political News

  
రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సైబరాబాద్‌లో బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించింది.
విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య తనూజ రంజన్ హత్య కేసులో ఎట్టకేలకు కీలక పురోగతి లభించింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య కేసులో పోలీసులకు భారీ విజయం లభించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు
సంగారెడ్డి పట్టణంలో సోమవారం ఆనంద క్షణాలు కనిపించాయి.
మంగళవారం నుంచి ఈ నెల 22 వరకూ అంటే పది రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో తూర్పు తెలంగాణ నిప్పుల గుండంగా మారనుంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ యవనికపై కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఈ కేసు నమోదు కావడానికి కొద్ది గంటల ముందే భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. ఆ బాలిక కుటుంబం తనను తప్పుడు కేసులతో బ్లాక్‌మెయిల్ చేస్తూ ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే భయంతో రూ.50వేలు చెల్లించానని.. అయినా వారి వేధింపులు పెరిగిపోయాయని ఆ ఫిర్యాదులో ఆరోపించారు బండి బగీరథ్. తాను పెళ్లికి నిరాకరించినందుకే ఈ కుట్ర పన్నారని అంటున్నారాయన.
రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కేసు వివరాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు. అదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి వచ్చిందనీ, పోలీస్ సిబ్బంది ఎక్కువగా ఆ బాధ్యతల్లో నిమగ్నమ య్యారని డిజిపి ఆనంద్ వివరించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన వివాదాస్పద కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పూజిత.. పూజిత ఆరున్నర ఏళ్ల క్రితం ఎంఎస్ చదవేందుకు లండన్ వెళ్లారు. చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉద్యోగంలో చేరి, గత ఏడాది గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన కడదూరి శ్రీనివాస్‌ను వివాహం చేసుకుని లండన్ లో స్థిరపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.