అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

Publish Date:May 11, 2026

Advertisement

 

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, విభజన హామీల అమలుపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.

అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు కోరారు. అలాగే రాజధాని ప్రాంతంలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమరావతిలో కొనసాగుతున్న పనుల పురోగతిని వివరించిన ఆయన, కేంద్ర సంస్థలు వస్తే రాజధాని ప్రాంత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని అమిత్ షాకు వివరించారు.

రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు.

ఇదే సమయంలో కేంద్ర సహకార శాఖ నుంచి మరింత మద్దతు లభిస్తే రాష్ట్రంలోని రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ చంద్రబాబు సమగ్ర నివేదికను అమిత్ షాకు అందించినట్లు సమాచారం.

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు
సంగారెడ్డి పట్టణంలో సోమవారం ఆనంద క్షణాలు కనిపించాయి.
మంగళవారం నుంచి ఈ నెల 22 వరకూ అంటే పది రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో తూర్పు తెలంగాణ నిప్పుల గుండంగా మారనుంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ యవనికపై కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఈ కేసు నమోదు కావడానికి కొద్ది గంటల ముందే భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. ఆ బాలిక కుటుంబం తనను తప్పుడు కేసులతో బ్లాక్‌మెయిల్ చేస్తూ ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే భయంతో రూ.50వేలు చెల్లించానని.. అయినా వారి వేధింపులు పెరిగిపోయాయని ఆ ఫిర్యాదులో ఆరోపించారు బండి బగీరథ్. తాను పెళ్లికి నిరాకరించినందుకే ఈ కుట్ర పన్నారని అంటున్నారాయన.
రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కేసు వివరాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు. అదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి వచ్చిందనీ, పోలీస్ సిబ్బంది ఎక్కువగా ఆ బాధ్యతల్లో నిమగ్నమ య్యారని డిజిపి ఆనంద్ వివరించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన వివాదాస్పద కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పూజిత.. పూజిత ఆరున్నర ఏళ్ల క్రితం ఎంఎస్ చదవేందుకు లండన్ వెళ్లారు. చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉద్యోగంలో చేరి, గత ఏడాది గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన కడదూరి శ్రీనివాస్‌ను వివాహం చేసుకుని లండన్ లో స్థిరపడ్డారు.
మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం సీఎం నారా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ అరుదైన, అత్యంత భావోద్వేగపూరితమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.
ప్రేమ పేరుతో 16 ఏళ్ల బాలికను మాయమాటలతో ట్రాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువనటుడు భరత్ కాంత్ తుది శ్వాస విడిచాడు. ఈ ప్రమాదంలో సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా కన్నుమూశారు. అప్పుడప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఒక యువ ప్రతిభావంతుడు ఇలా ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.
ఐపీఎల్ లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకూ విజయం ఇరు జట్లతోనూ దోబూచులాడింది. చివరి బంతికి అవసరమైన రెండు పరుగులు తీసి ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ నే కాకుండా లక్నో సూపర్ జయంట్స్ జట్టును కూడా ప్లే ఆప్ రేస్ నుంచి ఔట్ అయిపోయేలా చేసింది.
 దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భాగ్యనగరంలో పర్యటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.