బండికి ‘సన్’ స్ట్రోక్

Publish Date:May 11, 2026

Advertisement

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోస్కో  కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలీ కేసు ఏంటంటే.. 17 ఏళ్ల మైనర్ బాలికను భగీరథ్ లైంగికంగా వేధించారనీ, మోయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగిందని బాలిక తల్లి పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న జరిగిన పార్టీలో బాలికపై అత్యాచారం జరిగిందని..  ఆ తర్వాత ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

అయితే.. ఈ కేసు నమోదు కావడానికి కొద్ది గంటల ముందే భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఓ  ఫిర్యాదు చేశారు. ఆ బాలిక కుటుంబం తనను తప్పుడు కేసులతో బ్లాక్‌మెయిల్ చేస్తూ ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఇప్పటికే భయంతో రూ.50వేలు చెల్లించానని..  అయినా వారి వేధింపులు పెరిగిపోయాయని ఆ ఫిర్యాదులో ఆరోపించారు బండి బగీరథ్.  తాను పెళ్లికి నిరాకరించినందుకే ఈ కుట్ర పన్నారని అంటున్నారాయన. 

ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ న‌డుస్తోంది. బీజేపీ బేటీ బచావో నినాదంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఇతర పార్టీల నేతలపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించేవారు. ఇప్పుడాయన కుమారుడిపైనే కేసు నమోదు కావడంతో.. ప్రతిపక్షాలు..  నెటిజన్లు  బేటీ బచావో కాదు.. బేటా బచావో.. అంటే కొడుకును ముందు కాపాడుకో అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

ప్రధాని మోడీని ఉద్దేశించి..  మీ శిష్యుడి కొడుకు అరాచకాలు చూడండి అనేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ శత్రువులు బండి సంజయ్‌ను నైతికంగా దెబ్బతీయడానికి ఈ కేసును వాడుకుంటున్నారు. ఇక‌ బీఆర్ఎస్ నేతలు, ఇత‌ర‌ మహిళా సంఘాలు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు.  ప్రస్తుతానికి పోలీసులు రెండు ఫిర్యాదులను వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఫైన‌ల్ గా పోలీసుల వెర్షన్ ఏంటంటే..  ఇది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కుమారుడి  కేసు కావ‌డంతో సునిశిత‌మైన వ్య‌వ‌హారం. బాలిక మైనర్ అని తేలడంతో ప్రాథమికంగా అయితే ఎలాంటి  సందేహాలకూ తావు లేకుండా.. పోక్సో కేసు నమోదు చేశామని, అయితే బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. డిజిటల్ ఆధారాలైన చాటింగ్స్, ఫోన్ కాల్స్.. ఈ కేసులో కీలకం కానున్నాయంటున్నారు.

రాజకీయంగానూ ఇలాంటి కేసులు ప్ర‌త్య‌ర్ధుల ప్ర‌ధానాస్త్రాలుగా మారుతుంటాయి. ఇది రాజకీయ కుట్ర అని బీజేపీ వర్గాలు అంటుంటే..  చట్టం తన పని తాను చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలోకి వెళ్లనుంది. ఒకవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు, మరోవైపు  హనీ ట్రాప్  ఆరోపణలు.. ఈ రెండింటిలో ఏది నిజమనేది పోలీసుల  దర్యాప్తులో తేలాల్సి ఉంది.

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు
సంగారెడ్డి పట్టణంలో సోమవారం ఆనంద క్షణాలు కనిపించాయి.
మంగళవారం నుంచి ఈ నెల 22 వరకూ అంటే పది రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో తూర్పు తెలంగాణ నిప్పుల గుండంగా మారనుంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ యవనికపై కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కేసు వివరాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు. అదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి వచ్చిందనీ, పోలీస్ సిబ్బంది ఎక్కువగా ఆ బాధ్యతల్లో నిమగ్నమ య్యారని డిజిపి ఆనంద్ వివరించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన వివాదాస్పద కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పూజిత.. పూజిత ఆరున్నర ఏళ్ల క్రితం ఎంఎస్ చదవేందుకు లండన్ వెళ్లారు. చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉద్యోగంలో చేరి, గత ఏడాది గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన కడదూరి శ్రీనివాస్‌ను వివాహం చేసుకుని లండన్ లో స్థిరపడ్డారు.
మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం సీఎం నారా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ అరుదైన, అత్యంత భావోద్వేగపూరితమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.
ప్రేమ పేరుతో 16 ఏళ్ల బాలికను మాయమాటలతో ట్రాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువనటుడు భరత్ కాంత్ తుది శ్వాస విడిచాడు. ఈ ప్రమాదంలో సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా కన్నుమూశారు. అప్పుడప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఒక యువ ప్రతిభావంతుడు ఇలా ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.
ఐపీఎల్ లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకూ విజయం ఇరు జట్లతోనూ దోబూచులాడింది. చివరి బంతికి అవసరమైన రెండు పరుగులు తీసి ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ నే కాకుండా లక్నో సూపర్ జయంట్స్ జట్టును కూడా ప్లే ఆప్ రేస్ నుంచి ఔట్ అయిపోయేలా చేసింది.
 దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భాగ్యనగరంలో పర్యటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.