నేనున్నా మిత్రమా.. సంక్షోభం వేళ భారత్ కు రష్యా అండ

Publish Date:Mar 4, 2026

Advertisement

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యూఎస్ ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడి చేయడం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై  ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హెర్మూజ్ జలసంధి ని ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసేయడంతో భారత్‌  ఇబ్బందుల్లో పడింది.

ఇదిలా ఉంటే, సంక్షోభ సమయాల్లో భారత్‌కు అండగా నిలిచే మిత్రదేశం రష్యా మరోసారి ముందుకు వచ్చింది. గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు రవాణాకు ఇబ్బంది ఎదురైతే తాము సరఫరా చేస్తామని రష్యా ప్రకటించింది.  భారత చమురు భద్రతకు హార్ముజ్ జలసంధి చాలా కీలకం. ప్రపంచ ఎల్ఎన్‌జీ సరఫరాలో దాదాపుగా 20 శాతం ఈ మార్గంపైనే ఆధారపడి ఉంది. భారత్ కు వచ్చే ముడి చమురు, ఎల్పీజీ దిగుమతుల్లో సుమారు సగం ఈ మార్గం గుండా వస్తుంది.

ప్రస్తుతం భారత్ కు తక్షణ సంక్షోభం లేదు. మన వద్ద ఉన్న 25 రోజుల ముడి చమురు, మరో 25 రోజుల పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. ఈ మొత్తం 50 రోజుల వినియోగానికి సరిపోతుంది. దేశీయ అవసరాలకు తగినంత నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం భారత్ సొంతం. ఐదో అతిపెద్ద పెట్రోలియం ఎగుమతిదారుగా కూడా భారత్ ఉంది. గల్ఫ్ నుంచి పరిస్థితులు విషమిస్తే, రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

By
en-us Political News

  
యూఏఈ తన భద్రత, ఆర్థిక, కరెన్సీ వ్యూహాలను పునఃపరిశీలిస్తోంది. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల నిజంగా ప్రయోజనం ఉందా? లేక ఇది దేశానికి అదనపు ప్రమాదాన్ని తెస్తుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని డిపోల ముందు డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో చేరి నిరసలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్ లు, బస్ స్టేషన్లు బోసిపోయాయి. ఇక హైదరాబాద్ లో అయితే సిటీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనాథల రాతను మారుస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ సంధించిన అక్షరాయుధం నెల్లూరులో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. మున్సిపల్ స్కూల్స్ భవనాలు చూసి ముగ్ధులై, భిక్షా పాత్రలను విసిరికొట్టి పుస్తకాలు పట్టిన ఆ చిన్నారుల పట్టుదల, నేడు వారిని సమాజం గర్వపడే హీరోలుగా నిలబెట్టింది.
వీరు ఒక వ్యక్తిగత కుటుంబ వివాదాన్ని ఆధారంగా చేసుకుని బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి సి ఐ ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారనీ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పరుగుల వరద పారించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోశాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్37 పరుగులు, ఇషాన్ కిషన్ పాతిక పరుగులు చేశారు. చివరిలో హెన్రిచ్ క్లాసెన్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించి 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
కేరళలోని త్రిస్సూర్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఓ మైనర్ బాలుడు తన స్నేహితుల మాదిరిగా రీల్స్ చేసి గుర్తింపు పొందాలని ఆశపడ్డాడు. కానీ అదే ఆలోచన చివరకు అతని ప్రాణాన్ని బలి తీసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక మామిడి తోట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందని కుటుంబం ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే పరిమితమైంది.
త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగనున్నాయన్న చర్చతో వినియోగదారుల్లో గుబులు రేగుతోంది.
హిమాలయ పర్వతాల మధ్య విరాజిల్లుతున్న పవిత్ర క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం రేపు ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకోనుంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకలో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.