Publish Date:Apr 21, 2026
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఆశతో చాలా మంది యువత ప్రమాదకర రీల్స్ చేస్తూ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి విషాదకర సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడు తన స్నేహితుల మాదిరిగా రీల్స్ చేసి గుర్తింపు పొందాలని ఆశపడ్డాడు. కానీ అదే ఆలోచన చివరకు అతని ప్రాణాన్ని బలి తీసుకుంది.
నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలోని ఓ బస్తీలో నివసిస్తున్న మితున్ (14) సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ఫేమస్ కావాలని ఆశపడ్డాడు.ఈ నెల 5వ తేదీన తన స్నేహితులతో కలిసి ఓ భవనం పైకెక్కిన మితున్, బాల్కనీ రైలింగ్ పిట్టగోడపై రిస్కీ ఫీట్స్ చేస్తుండగా అనుకోకుండా కాలుజారి కిందపడిపోయాడు. భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు బయటికి పరుగులు తీసి చూడగా, బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
తక్షణమే కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో మితున్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మితున్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మితున్ మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతదేహాన్ని అతని స్వస్థలమైన బీహార్‌కు తరలిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reels-craze-takes-boys-life-36-217892.html
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.