ఇరాన్ యుద్ధం.. యూఏఈ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ
Publish Date:Apr 22, 2026
Advertisement
ఇరాన్ యుద్ధం తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అమెరికా సైనిక స్థావరాల అవసరంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్, అమెరికా ఘర్షణ గల్ఫ్ ప్రాంతాన్ని కుదిపేసిన తర్వాత.. యూఏఈ తన భద్రత, ఆర్థిక, కరెన్సీ వ్యూహాలను పునఃపరిశీలిస్తోంది. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల నిజంగా ప్రయోజనం ఉందా? లేక ఇది దేశానికి అదనపు ప్రమాదాన్ని తెస్తుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో, యూఏఈ చైనాతో మరింత సన్నిహిత సంబంధాలను అన్వేషిస్తూ, అమెరికా డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించే సంకేతాలు ఇస్తోంది. అమెరికా స్థావరాలు.. వ్యూహాత్మక ఆస్తి కాదు.. భారం? యూఏఈలోని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అబ్దుల్ ఖలేఖ్ అబ్దుల్లా అభిప్రాయం మేరకు.. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు యూఏఈ రక్షణ వ్యవస్థలోని బలాలనూ, బలహీనతలను బహిర్గతం చేశాయి. ఈ దాడుల సమయంలో యూఏఈ స్వయంగా తనను తాను రక్షించుకోగలదని నిరూపించుకుంది. అందువల్ల అల్ ధఫ్రా ఎయిర్ బేస్ సహా అమెరికా సైనిక స్థావరాలు ఇప్పుడు ఆస్తిగా కాకుండా భారంగా కనిపిస్తున్నాయని ఆయన అంటున్నారు. యూఏఈలో సుమారు 3,500 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇప్పుడు అబుదాబిలో జరుగుతున్న చర్చల్లో ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. అమెరికా దళాలు నిజంగా మన భద్రతను పెంచుతున్నాయా? లేక మనపై దాడులు జరిగే అవకాశాన్ని పెంచుతున్నాయా? అన్నదే. ఇరాన్ దాడులు.. ఆర్థిక ప్రభావం: బిలియన్ల నష్టం ఇరాన్ యూఏఈపై ప్రయోగించిన వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపాయి. దుబాయ్, అబుదాబి మార్కెట్ క్యాపిటలైజేషన్లో 120 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. 18 వేలకు పైగా విమానాలు రద్దు. దుబాయ్ రియల్ ఎస్టేట్ సూచీల పతనం. విమానాశ్రయాలు, ఓడరేవులు, పారిశ్రామిక కేంద్రాలు, పెట్రోకెమికల్ సదుపాయాలు దెబ్బతినడం సహా పౌరులు, సైనికులు మరణించారు. ఈ దాడులు యూఏఈ ఆర్థిక వ్యవస్థ ఎంతగా బయటి నుంచి వచ్చే ప్రమాదాలకు గురవుతుందో స్పష్టంగా చూపించాయి. అమెరికా ఆర్థిక మద్దతు: స్వాప్ లైన్ చర్చలు యుద్ధం వల్ల వచ్చిన ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యూఏఈ, అమెరికాతో అత్యవసర ఆర్థిక చర్చలు జరిపింది. తీవ్రమైన మార్కెట్ ఒత్తిడి సమయంలో యూఏఈ సెంట్రల్ బ్యాంక్ కు డాలర్ల లభ్యతను హామీ చేసే కరెన్సీ స్వాప్ లైన్ కోరింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సాధారణంగా అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థలకే స్వాప్ లైన్లు ఇస్తుంది. కాబట్టి ఆ స్వాప్ లైన్ పొందే అర్హతను యూఏఈ సాధించే అవకాశాలు తక్కువ. అందుకు బదులుగా యూఎస్ ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా మద్దతు పొందే అవకాశం ఉంది. యుద్ధం తర్వాత డాలర్ లభ్యతపై అనిశ్చితి పెరగడంతో.. యూఏఈ ప్రత్యామ్నాయ కరెన్సీలను పరిశీలిస్తోంది. యూఏఈ అధికారులు సూచించిన మార్పులు - చమురు మరియు ఇతర ప్రధాన లావాదేవీలలో చైనీస్ యువాన్ వినియోగం యూఏఈ కొత్త దిశలో ప్రయాణించడానికి ఇరాన్ అమెరికా యుద్ధం మార్గం చూపింది. ఇరాన్ యుద్ధం యూఏఈకి ఒక కీలక పాఠం నేర్పింది. అదేమిటంటే.. భద్రత, ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ ఈ మూడింటినీ వికేంద్రీకరించాలి. అమెరికా సైనిక దళాలపై ఆధారపడటం, డాలర్ పై ఆధారపడటం.. ఇవి రెండూ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. చైనాతో పెరుగుతున్న సంబంధాలు, యువాన్ వినియోగం, ఆర్థిక భద్రతా వ్యవస్థల పునర్నిర్మాణంఇవే ఇప్పుడు యూఏఈ భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించే కీలక అంశాలు. -సీతారాం కంఠంనేని
- ఇది ప్రపంచ చమురు వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు
- చైనా యువాన్ను అంతర్జాతీయీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఇది అనుకూలం
ఇది గల్ఫ్ ప్రాంతంలో డాలర్ రహితీకరణ దిశగా కీలకమైన ముందడుగు
ఇరాన్–అమెరికా ఘర్షణ ప్రభావం యూఏఈకే పరిమితం కాలేదు. ప్రాంతాల వారీగా విపరీతమైన నష్టం వాటిల్లింది.
- ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్ జీ కాంప్లెక్స్ మూసివేత.
- దీని పునరుద్ధరణకు 3 నుంచి 5 సంవత్సరాలు పట్టవచ్చు.
- సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, జోర్డాన్లలో మౌలిక సదుపాయాల నష్టం.
- ప్రాణనష్టం, ఇంధన సరఫరా అంతరాయం
ఐఎంఎఫ్ అంచనా ప్రకారం, ప్రతి దేశం పునరుద్ధరణ వేగం భౌగోళిక పరిస్థితులు, ఎగుమతుల పునఃప్రారంభం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. చైనా ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటున్నది. గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశంగా చూస్తోంది. అబుదాబి యువరాజుతో చర్చల్లో జీజిన్పింగ్ చారిత్రాత్మక మార్పులు జరుగుతున్నాయి అని వ్యాఖ్యానించారు. చైనా, అరబ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు ఇంధన, మౌలిక సదుపాయాలు, కరెన్సీ సహకారం వంటి రంగాల్లో చైనా ప్రభావం పెరుగుతోంది.
http://www.teluguone.com/news/content/iran-and-america-war-36-217909.html





