ఆపరేషన్ సింధూర్.. ఈ పేరు వెనుక రహస్యం ఇదే..!

Publish Date:May 10, 2025

Advertisement


మూడు రోజుల కిందట భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది.  ఈ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన మరుసటి రోజు యావత్ భారతదేశాన్ని ఆకర్షించింది. ఈ వార్త వెలువడిన వెంటనే, దేశవాసుల తడి కళ్ళు భారత సైన్యం పట్ల విశ్వాసం,  గౌరవాన్ని ప్రతిబింబించాయి. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు భారత దేశ పౌరులపై జరిగిన పిరికి దాడికి తగిన సమాధానం. ఈ  ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టడం దేశాన్ని,  దేశ ప్రజలను మరింతగా ఆకర్షించింది. ఈ పేరు వెనుక ఉన్న రహస్యం తెలుసుకుంటే..

"సిందూర్" అనేది ఒక చిన్న ఎర్ర చుక్క.  ఇది  భారతీయ హిందూ మత స్త్రీలకు ఎంతో పవిత్రమైనది.   ఇది భారతీయ స్త్రీ గౌరవం, ప్రేమ మరియు శక్తికి చిహ్నం.  స్త్రీల నుదుటిపై ఉన్న సింధూరం పహల్గామ్ భూమిపై రక్తంతో కలిసినప్పుడు, ఈ అవమానాన్ని సహించబోమని దేశం నిర్ణయించుకుంది. ఈ భావన ఫలితంగానే ఆపరేషన్ సింధూర్ ఏర్పడింది.

ప్రాముఖ్యత..

భారతీయ సంస్కృతిలో సిందూరం అలంకరణలో ఒక భాగం మాత్రమే కాదు, ఇది లోతైన మతపరమైన,  సాంస్కృతిక అర్థాలతో కూడా ముడిపడి ఉంది. ఇది వివాహిత స్త్రీ గుర్తింపుకు,  తన భర్త దీర్ఘాయుష్షు పొందాలనే  కోరికకు చిహ్నం. స్త్రీ నుదిటిన సింధూరం పెట్టుకుంటారు. దీనిని అజ్ఞ చక్రం లేదా మూడవ కన్ను అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఆత్మ,  చైతన్యానికి కేంద్రంగా పరిగణించబడుతుంది.

శక్తి..

సింధూరం  ఎరుపు రంగు లో ఉంటుంది. ఇది శక్తకి చిహ్నం.  ఇది శక్తిని,  పోరాటాన్ని సూచిస్తుంది. ఈ రంగు స్త్రీ  అంతర్గత బలం,  దృఢత్వాన్ని కూడా తెలియజేస్తుంది. దుర్గాదేవి విగ్రహాన్ని పూజించేటప్పుడు అమ్మవారి నుదిటిపై సింధూరం పూయడానికి ఇదే కారణం.

శాంతియుతంగా ఉండే భారతదేశం చాలా పవిత్రమైన,  ఎంతో గొప్ప దేశంగా పేర్కొనబడుతుంది. అయితే అదే సమయంలో భారతదేశ పౌరుల మతం,  గౌరవం దెబ్బతింటే ముఖ్యంగా మహిళల గౌరవం,  మహిళల జీవితం,  మతం మీద దాడి జరిగితే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ వివరిస్తుంది. చిటికెడు సింధూరం ధర తక్కువే కానీ,  భారతీయ మహిళల నుదుటన ఉన్న సింధూరం జోలికి వెళితే ఎలా ఉంటుందో ఎంతటి పర్యవసానాలు ఉంటాయో ఆపరేషన్ సింధూర్ తెలుపుతుంది.


                        *రూపశ్రీ.

By
en-us Political News

  
క్రమ శిక్షణ ప్రతి వ్యక్తి జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతుంది.
వేసవికాలంలో తాహతు ఉన్నవారు ఏసీ ఏర్పాటు చేయించుకోవడం,  చల్లని గదులలో సేద తీరడం చాలా సాధారణ విషయం.
పుట్టినప్పటి నుండి ఎలాంటి పరిచయం లేకుండా పెళ్లి అనే ఒక బంధంతో ఇద్దరూ ఒకటై జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది.
సమాజంలో చాలా వరకు మధ్యతరగతి,దిగు తరగతి కుటుంబాలే ఉంటాయి.
తల్లిదండ్రుల తో బంధం చిన్నతనం నుంచి ఉంటుంది.
 ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం.
నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి....
వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన.
ఇల్లు అయినా,  ఆఫీసు అయినా.. వేరే ఇతర ప్రదేశమైనా.. అందరూ మనల్ని ఇష్టపడాలని,  అందరూ మనకు ఆకర్షితమవ్వాలని,  మనల్ని గౌరవించాలని అనుకోవడంలో తప్పు లేదు.
ఒక వ్యక్తి చాణక్య నీతి సూత్రాలను లోతుగా అధ్యయనం చేస్తే అతను జీవితంలో ప్రతి అడుగులోనూ విజయం సాధిస్తాడు.
కాశ్మీర్ అనేది కేవలం ఒక భూభాగం కాదు. చరిత్ర, జానపద కథలు,  సంస్కృతి  పొరలతో చుట్టబడిన పేరు.  
ఈ జనరేషన్ ను ఆల్ఫా యుగం అనవచ్చు. ఇది AI, స్మార్ట్ పరికరాలు, ఆన్‌లైన్ లెర్నింగ్,  సోషల్ మీడియా మధ్య పెరుగుతోంది.
నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.