రాహుల్ కు అప్పుడే మొదలైందిగా...
Publish Date:Nov 30, 2017
Advertisement
రాహుల్ గాంధీకి త్వరలో పార్టీ పగ్గాలు అప్పచెప్పనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుండి ఏంటి.. ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ చేతిలో పెట్టాలని చూస్తున్నా.. ఎందుకో దానికి తగిన సమయం మాత్రం రాలేదు. సమయం సంగతేమో కానీ.. రాహుల్ గాంధీ చేతిలో పార్టీని పెడితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అని సొంత పార్టీ నేతలే డౌట్ పడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే సోనియా కూడా తొందరపడి రాహుల్ కు బాధ్యతలు అప్పగించడానికి ఆలోచిస్తున్నారు. మధ్యలో పలువురు కాంగ్రెస్ నేతలే రాహుల్ బదులు ప్రియాంక గాంధీ పేరు ప్రస్థావించిన వారూ ఉన్నారు. కానీ అవేం జరగలేదు. అయితే ఇటీవలే మళ్లీ రాహుల్ కు డిసెంబర్ లో పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇక ఇప్పుడు కూడా రాహుల్ కు సేమ్ సిచ్యూవేషన్. సొంత పార్టీ నేతనే రాహుల్ పై సంచలన వ్యాఖ్యలు చేసే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత... షెహజాద్ పొన్నావాలా.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని నిలిపేందుకు ఓ నాటకం జరుగుతోందని, అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ యావత్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతోందని అన్నాడు. ఇదేమీ వాస్తవ ఎన్నిక కాదని, సిగ్గుపడాల్సిన ఎన్నికని.. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తిని పైకి తెచ్చేందుకు జరుగుతున్న డ్రామా అని అన్నారు. జరుగుతున్న తప్పును తాను ఎత్తి చూపుతున్నానని, కాంగ్రెస్ లోని ఎంతో మందికి ఈ విషయమై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ముందుగా తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆపై అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడాలని అన్నారు. ఈ ఎన్నిక పారదర్శకంగా జరిగేట్టయితే బాగుంటుందని, ఇదే విషయాన్ని రాహుల్ కు లేఖ ద్వారా తెలిపానని అన్నారు. పూర్తి రిగ్ అయిన ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని, అసలు ఈ విధానమే తప్పుల తడకని పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి షెహజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి. సొంత పార్టీ నేతనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే రాహుల్ కెపాసిటీ ఏంటో అర్ధమవుతోంది. ఇంకా ఎంత మంది వ్యతిరేకంగా ఉన్నారో తెలియదు. మరి సొంత పార్టీ నేతలే ఇంత వ్యతిరేకతో ఉంటే ఇంకా పార్టీ బాధ్యతలు రాహుల్ ఎలా మోస్తాడూ.. పార్టీని ఎలా పైకి తీసుకొస్తాడు..
http://www.teluguone.com/news/content/rahul-gandhi-45-79034.html





