పోలవరానికి కేంద్రం అడ్డుపుల్ల... రాజు గారు ఇవి కనిపించవా...!
Publish Date:Nov 30, 2017
Advertisement
కేంద్రానికి ఏపీపై ఉన్న చిన్నచూపు మరోసారి బయటపడింది. ఇప్పటికి ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.. పోనీ స్పెషల్ ప్యాకేజీ విషయంలో అయినా సాయం చేస్తుందా అంటే.. ఏదో ముష్టి పడేసినట్టే అప్పుడు కొంచెం.. అప్పుడు కొంచెం నిధులు ఇస్తుంది. ఆ నిధులు అయిపోయిన తరువాత మళ్లీ బాబు గారు కేంద్రం దగ్గరకు వెళ్లి అడుక్కోవాల్సిన పరిస్థితి. ఇంతేనా ఇంకా ఎన్నో విషయాల్లో ఏపీపై కేంద్రం చిన్న చూపే చూస్తుంది. ఎన్నో వేల కోట్లు ప్రాజెక్టులు కేంద్రం వల్లే పెండింగుల్లో పడ్డాయి. ముందు మీరు డబ్బు పెట్టుకోండి.. ఆ తరువాత మమ్మల్ని అడగండి అని చెబుతున్నారు. అసలే రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉంటే..ఆ మాత్రం కూడా ఆలోచించకుండా కేంద్రం మొండిచేయి చూపిస్తుంది. ఏదో ఒకలా పోలవరం ప్రాజెక్టు అయినా పూర్తి చేస్తుంది కదా అనుకునే లోపు ఇప్పుడు దానికి కూడా అడ్డు పుల్ల వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పనులకు టెండర్లు పిలవగా కేంద్రం వాటిని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్పిల్‌వే, స్పిల్ చానల్‌లో కొంత భాగానికి జారీ చేసిన టెండర్లను నిలిపివేయాలని స్పష్టం చేసింది. జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ అద్యయనం చేసేవరకు పనులను నిలుపుదల చేయాలని కేంద్రం తెలిపిందని సమాచారం. ఎన్‌హెచ్‌పీసీ ఎగువ కాఫర్ డ్యామ్ పనులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు రాలేదు. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు బ్రేకులు వెయ్యాలని చూడటంతో రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరి పోలవరం విషయంలో తాము చెబితేనే చంద్రబాబు ముందుకు కదిలారని చెప్పుకుంటున్న బీజేపీ నేత సోము వీర్రాజు ఇప్పుడు దీనిపై మాట్లాడటానికి నోరు రావడం లేదేంటో...పోలవరం నిర్మాణం కోసం తెలంగాణ లోని ఏడు ముంపు మండలాలు ఏపీ లో కలపకపోతే ఇబ్బంది అవుతుందని సీఎం చంద్రబాబుకు ఎవరు చెప్పారో తెలుసా ? బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అట. తాను చెప్పాకే ఆ విషయంలో సీరియస్ నెస్ గమనించిన చంద్రబాబు ఆ 7 మండలాలను ఏపీ లో కలపకపోతే సీఎం గా ప్రమాణస్వీకారం చేయనని చెప్పడంతో ఆ పని వెంటనే పూర్తి అయ్యిందని చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు పోలవరానికి కేంద్రం కొర్రీ వేయడం గురించి మాత్రం ప్రస్తావించలేదు. కాపర్ డాం , స్పిల్ వే, స్పిల్ చానెల్ పనులు ఆపాలని కేంద్రం లేఖ రాసింది ఎందుకో చెప్పలేకపోతున్నారు. 2019 ఎన్నికల లోపు పోలవరం పనులను ఓ కొలిక్కి తేవాలని చూస్తున్న చంద్రబాబుకు కేంద్రం అడుగడుగునా అడ్డం పడడం అందరికీ కనిపిస్తున్నా ఇంకా కొందరు బీజేపీ నేతలు మోడీ క్రెడిట్ గురించి మాట్లాడడం చూసి ఏపీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరి పోలవరం విషయంలో కూడా కేంద్రం ఇలాంటి పుల్లలు పెడితే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. అది కేంద్ర ప్రభుత్వమైనా సరే.. వీర్రాజు లాంటి వారైనా సరే....
http://www.teluguone.com/news/content/chandrababu-45-79038.html





