220 పరుగుల విజయలక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసిన పంజాబ్ కింగ్స్

Publish Date:Apr 11, 2026

Advertisement

క్రికెట్ మజా ఏంటన్నది ఐపీఎల్ 2016 కళ్లకు కడుతోంది. లీగ్ దశలో ప్రతి మ్యాచ్చూ కన్నుల పండువగా సాగుతోంది. పరుగుల పండుగ కొనసాగుతోంది.  . న్యూ చండీగఢ్ వేదికగా శనివారం (ఏప్రిల్ 11) జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ నిర్దేశించిన  220 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఇంకా 1.1 ఓబర్లు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛఏదించింది.  

టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ఇన్నింగ్స్ లో  5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి  తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించారు.

అయితే, భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (57), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (51) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. అయితే   సన్‌రైజర్స్ బౌలర్ శివాంగ్ కుమార్ ఒకే ఓవర్‌లో వీరిద్దరినీ అవుట్ చేయడంతో సన్ రైజర్స్ మ్యాచ్ పై పట్టు బిగించిందని అనిపించింది. అయితే పంజాబ్ కింగ్స్ స్కిప్పర్   శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ ఆశలపై నీళ్లు జల్లాడు. శ్రేయస్ అయ్యర్ కేవలం 33 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను ముగించాడు.  

ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. డే/నైట్ మ్యాచ్‌లలో 215 పైచిలుకు భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది.    

By
en-us Political News

  
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు.
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.