బూతు మాటల్లో నిజాయితీ ఉంటుందా!

Publish Date:Jun 19, 2019

Advertisement



నలుగురిలో ఉన్నప్పుడు ఎలాంటి పదాలు ఉపయోగించాలి? అని మనకి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తుంటారు. అసభ్యంగా, అశ్లీలంగా తోచే పదాలని నలుగురిలోనూ వాడకపోవడం సంస్కారం అని చెబుతూ ఉంటారు. అందుకే మన పదాలన్నీ ఆచితూచి ఉంటాయి. ఏవన్నా తేడాపాడాగా పదం బయటకు రావాలని ప్రయత్నిస్తే... దానిని లోలోపలే కప్పెట్టేస్తాం. తరచూ బూతులు మాట్లాడేవారిని అనాగరికులుగా, మొరటు మనుషులుగా భావిస్తుంటాం. కానీ అలా ఏది పడితే అది మాట్లాడేవారిలో నిజాయితీ పాలు ఎక్కువ అని చెబుతోంది ఓ పరిశోధన!!!

 

ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అసభ్యపదజాలానికీ, నిజాయితీకి మధ్య ఉండే పొంతనని గమనించాలని అనుకున్నారు. ఇందుకోసం వారు కొన్ని వందల మందిని ఎన్నుకొని వారి మాటతీరు మీద అనేక ప్రశ్నలు గుప్పించారు. ఆ తరువాత వారు చెబుతున్నదానిలో ఎంతవరకూ నిజం ఉందో తెలుసుకునేందుకు lie testను నిర్వహించారు. తమకి కోపం, కసి, చిరాకు, ఆశ్చర్యం వంటి అనుభూతులను వ్యక్తపరిచేటప్పుడు, వీరిలో కొందరు బూతుమాటలని గుప్పించడాన్ని గమనించారు. చిత్రం ఏమిటంటే వీరిలో నిజాయీతీపాళ్లు కాస్త ఎక్కువగా ధ్వనించాయట.

 

బూతుమాటలకీ నిజాయితీకీ మధ్య సంబంధం ఏమిటన్న ప్రశ్న రావచ్చు. దీనికి పరిశోధకులు స్పష్టమైన జవాబుని అందిస్తున్నారు. మనసులో ఏదీ దాచుకోనివారు, అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాలని ప్రయత్నించేవారు... తమకి ఏది తోస్తే అది మాట్లాడేసే స్వభావాన్ని కలిగి ఉంటారట. సహజంగానే అందులో బూతులు కూడా చోటు చేసుకోవచ్చు.

 

పైన పేర్కొన్న ప్రయోగం ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు పరిశోధకులు మరో పరీక్షని కూడా నిర్వహించారు. ఇందుకోసం 75,000 మంది ఫేస్బుక్ యూజర్స్ని ఎన్నుకొన్నారు. వీరి ఆన్లైన్ సంభాషణల్లోని పదాలు ఎలా ఉన్నాయో గమనించారు. వీటిలో కూడా, మొరటు పదాలు వాడిన సంభాషణల్లో నిజాయితీ ఎక్కువగా కనిపించింది. ఇంతేకాదు! చీటికీ ఏదన్నా విషయం చెప్పేముందు ఒట్టుపెట్టుకునేవారిలో కూడా నిజాలను చెప్పే అలవాటు ఉందని తేలింది. ‘నా మాటలో నిజాయితీ ఉంది. నన్ను నమ్ము!’ అని ఒప్పించేందుకే వారు ఇలా ఒట్లు పెట్టుకుంటారట.

 

అదీ విషయం! అసభ్యంగా మాట్లాడటం, ఒట్టు పెట్టుకోవడం వెనుక ఇంత కథ ఉందన్నమాట. అలాగని ఇది అందరికీ వర్తిస్తుందనుకోవడానికి లేదు. పనిగట్టుకుని మరీ అసభ్యంగా మాట్లాడాల్సిన అగత్యమూ లేదు. మనుషుల వ్యక్తిత్వాలని పరిశీలించేందుకే కానీ, ఇలా ఉంటే మంచిది అని చెప్పడం ఈ పరిశోధన ఉద్దేశం కాదు. మనిషిలో సంస్కారం ఉంటే ఒట్టు పెట్టుకోకుండానే నిజాన్ని చెప్పగలడు. గుండెల్లో ధైర్యం ఉంటే అసభ్యతకు తావులేకుండానే, నిజాన్ని కుండబద్దలు కొట్టేయగలడు.

- నిర్జర.

By
en-us Political News

  
దీపావళి పార్టీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రెండింగ్ వైరల్ ధోక్లా చాట్ రెసిపీని తెలుసుకోండి. సాఫ్ట్ ధోక్లా, పెరుగు, చట్నీలు మరియు కరకరలాడే సేవ్‌తో చేసే ఈ అద్భుతమైన స్నాక్ తయారీ విధానం.
దీపావళి సమయంలో టపాసుల వల్ల చేతులు లేదా శరీరం కాలితే మొదటి 5 నిమిషాల్లో ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి? ఏ ఇంటి చిట్కాలు ప్రమాదకరం? నిపుణుల సలహాలు మరియు పూర్తి గైడ్ ఇక్కడ తెలుసుకోండి.
ఆల్కహాల్ మరియు హెవీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ సమస్య ఎలా వస్తుంది? దీని లక్షణాలు, ప్రమాదాలు మరియు నివారణ మార్గాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
క్యాన్సర్ చికిత్స మరియు శస్త్రచికిత్స తర్వాత అకాల మెనోపాజ్ బారిన పడిన బాధితురాలి జీవన ప్రయాణం, దాని ప్రభావాలు మరియు అవగాహనపై ప్రత్యేక కథనం.
రాయలసీమ మరియు గోదావరి స్పెషల్ దూపుడు పోతు బిర్యానీని ఇంట్లోనే హోటల్ రుచితో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. లేత పొట్టేలు మాంసంతో చేసే ఈ బిర్యానీ తయారీ విధానం మరియు చిట్కాలు.
బార్లీ నీటి ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకోండి. ఫైబర్, బీటా గ్లూకాన్ నిండిన ఈ పానీయంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది మరియు శరీరం చల్లగా ఉంటుంది.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ మరియు మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండటానికి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హారతి సూచించిన 3 అద్భుతమైన పద్ధతులు మరియు 1:4 మ్యాజిక్ సీక్రెట్స్ తెలుసుకోండి.
పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రయాణం. ముఖ్యంగా మగపిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో మగపిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి....
గుండెపోటు లేదా హార్ట్ అటాక్ లక్షణాలు కనిపిస్తే అంబులెన్స్ వచ్చేలోపు ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి? చేయవలసిన పనులు, చేయకూడని పొరపాట్లు మరియు CPR ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
రాత్రిపూట పాదాలలో తీవ్రమైన మంట, దురద మరియు చికాకు వేధిస్తున్నాయా? బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ వెనుక ఉన్న డయాబెటిస్, విటమిన్ లోపాలు మరియు ఇతర ఆరోగ్య కారణాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వేడివేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉందా? 65 డిగ్రీల కంటే ఎక్కువ వేడి ఉన్న పానీయాలు అన్నవాహిక క్యాన్సర్‌కు ఎలా దారితీస్తాయో వైద్యుల హెచ్చరికలతో తెలుసుకోండి.
చిన్న పిల్లల నిద్ర వేళలు మరియు డేకేర్ కేంద్రాల నిబంధనల మధ్య సంబంధంపై తాజా పరిశోధనల విశేషాలు. వయస్సును బట్టి మారుతున్న పిల్లల నిద్ర అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కార్డియోజెనిక్ షాక్ నిర్ధారణ మరియు చికిత్స తీరును మెరుగుపరచడానికి SCAI విడుదల చేసిన తాజా నిపుణుల మార్గదర్శకాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.