క్యాన్సర్ నుంచి, కోలుకున్నాక ఎదురయ్యే మెనోపాజ్ సమస్యలు!
Publish Date:Nov 8, 2026
Advertisement
2022 సంవత్సరంలో ఈస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన 55 ఏళ్ల జో మెన్నీర్ (Jo Menneer) జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ సమయంలో ఆమె మెనోపాజ్ లక్షణాలను ఎదుర్కోవడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT) తీసుకుంటున్నారు. అయితే క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆమె శస్త్రచికిత్స (Surgery) చేయించుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఆమె తక్షణమే HRT తీసుకోవడం ఆపేయాల్సి వచ్చింది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఆమె దానిని మళ్లీ వాడే అవకాశం లేకుండా పోయింది. దీనితో ఆమె తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. క్యాన్సర్ శస్త్రచికిత్స అనంతర కోలుకునే దశ ఎంతో కష్టతరంగా ఉంటుందని ఆమె ముందుగానే ఊహించారు. కానీ, చికిత్స కారణంగా ఆమె శరీరం ఒక్కసారిగా తీవ్రమైన మెనోపాజ్ దశలోకి నెట్టబడుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న తరుణంలోనే వేడి ఆవిర్లు (Hot Flushes), కీళ్ల నొప్తులు (Aching Limbs), జ్ఞాపకశక్తి మందగించడం (Brain Fog) మరియు తీవ్రమైన భావోద్వేగ మార్పులు ఒక్కసారిగా తిరిగి దాడి చేశాయి. తాను దాదాపు 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినట్లు భావించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రభావాల గురించి వైద్య చికిత్స ప్రారంభంలో ఎవరూ ముందే హెచ్చరించకపోవడం పెద్ద షాక్‌గా మారిందని తెలిపారు. సాధారణంగా NHS నివేదికల ప్రకారం మహిళల్లో హార్మోన్ల స్థాయిలు తగ్గడం వల్ల 45 నుండి 55 సంవత్సరాల వయస్సులో మెనోపాజ్ దశ వస్తుంది. అయితే క్యాన్సర్ చికిత్సలు, కీమోథెరపీ (Chemotherapy), పెల్విక్ రేడియోథెరపీ (Pelvic Radiotherapy), స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మరియు అండాశయ శస్త్రచికిత్సల (Ovarian Surgery) కారణంగా కొందరిలో ఈ మెనోపాజ్ మరింత ముందే లేదా అత్యంత వేగంగా సంభవిస్తుంది. ఇది తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మహిళల శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తరుణంలో ఈ అదనపు సమస్యను ఎదుర్కోవడం రోగులకు మానసికంగా ఎంతో వేదనను కలిగిస్తుంది. ఈ సమస్యపై మహిళల్లో ముందస్తు అవగాహన మరియు తగిన మద్దతు ఎంతైనా అవసరమని జో మెన్నీర్ గట్టిగా కోరుతున్నారు. క్యాన్సర్ నిర్ధారణ జరిగినప్పటి నుంచే రోగులకు ఈ దీర్ఘకాలిక దుష్ప్రభావాల గురించి పూర్తి సమాచారం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ (DHSC) తన నేషనల్ క్యాన్సర్ ప్లాన్ ద్వారా రోగులకు వ్యక్తిగతీకరించిన ప్రణాళికను అందిస్తామని, దీనివల్ల మెనోపాజ్ వంటి దీర్ఘకాలిక ప్రభావాలను కూడా ముందుగానే గుర్తించి చికిత్సలో భాగంగా మలచవచ్చని తెలిపింది. ఇది కూడా చదవండి:బాణాసంచా గాయాలైతే వెంటనే తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స ఏమిటి? ప్రస్తుతం జో మెన్నీర్ మెనోపాజ్ అండ్ క్యాన్సర్ (Menopause and Cancer) అనే నాన్ఫ్రాఫిట్ సంస్థలో వాలంటీర్‌గా సేవలు అందిస్తున్నారు. యార్క్ నగరంలో క్యాన్సర్ అనంతర మెనోపాజ్ ఎదుర్కొంటున్న మహిళల కోసం ప్రత్యేకంగా ఒక సపోర్ట్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ఇతరులను కలుసుకోవడం తన జీవితాన్ని ఎంతో మార్చివేసిందని ఆమె పేర్కొన్నారు. తాము అనుభవించిన కష్టాలు రాబోయే కొత్త రోగులు ఎదుర్కొనకుండా వారికి అండగా నిలవడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. ప్రతి మహిళలో మెనోపాజ్ ప్రభావం వేర్వేరుగా ఉంటుందని, కాబట్టి ప్రారంభ దశ నుంచే తగిన సర్వీసులను సూచించే ఒక ప్రత్యేక టూల్‌కిట్ అందుబాటులో ఉండాలని జో అభిప్రాయపడ్డారు. రోగులకు తగిన సమాచారం ముందుగానే అందిస్తే, వారు తమకు సరిపోయే మార్గాలను స్వయంగా ఎంచుకోవడానికి వీలవుతుంది. క్యాన్సర్ చికిత్స ఎంత ముఖ్యమో, ఆ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పుల గురించి అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యమని ఈ ఉదంతం నిరూపిస్తోంది. మీకు నచ్చవచ్చు:అమ్మమ్మల కాలం, నాటి పెసరపప్పు హల్వా.. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది! కారానికి బదులు, పచ్చి కారంతో మటన్ కర్రీ, ఇలా చేయండి! Breast Cancer Journey, Premature Menopause After Cancer, Jo Mennear Story, Cancer Survivor Experience, Women Health Awareness, Medical Menopause Tips, Health Articles In Telugu.
http://www.teluguone.com/news/content/breast-cancer-treatment-35-236609.html





