పోక్సో కేసులో పోలీస్ కానిస్టేబుల్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష
Publish Date:May 15, 2026
Advertisement
చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ విభాగానికే చెందిన కానిస్టేబుల్‌కు భారీ శిక్ష పడింది. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు వరదరాజ్ సుదేశ్‌పై నేరం నిరూపితమై, పోక్సో ప్రత్యేక కోర్టు కఠిన తీర్పు వెలువరిం చింది.పోలీసు వృత్తిలో ఉండి సమాజానికి రక్షణగా నిలవాల్సిన వ్యక్తే చిన్నారిపై లైంగికదాడికి పాల్పడినట్టు కోర్టు తేల్చింది.ఈ కేసు విచారణలో సమర్పించిన సాక్ష్యాలు, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు దోషిగా నిర్ధారణ కావడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో కోర్టు నిందితుడికి 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ, అదనంగా రూ.12 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనపు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.ఇక బాధిత బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక నేరాలు చేసే వారికి కఠిన శిక్షలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం కింద కోర్టులు వేగంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటు న్నాయి. ఈ తీర్పు సమాజం లో బాలల భద్రతపై మరింత అవగాహన పెంచేలా నిలుస్తోంది.
http://www.teluguone.com/news/content/police-constable-sentenced-to-30-years-in-prison-in-pocso-case-36-219928.html




