సన్‌రైజర్స్...ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల రేట్లపై ఫ్యాన్స్ ఆగ్రహం

Publish Date:May 15, 2026

Advertisement

 

ఐపీఎల్‌లో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్‌లలో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  పోరుకు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరగడం ఫ్యాన్స్‌లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్ బుకింగ్ ప్రారంభం కావడంతో వేలాదిమంది అభిమానులు ఒకేసారి లాగిన్ అయ్యారు. యాప్‌లో దాదాపు 2.6 లక్షల మంది క్యూ‌లో ఉన్నట్లు కనిపించడంతో టికెట్ దక్కడం కష్టమైందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టికెట్లు కొద్ది నిమిషాల్లోనే “సోల్డ్ అవుట్”గా చూపించి, తర్వాత వాటిని బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక ధరలతో పోలిస్తే బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు.

పెరిగిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:

₹950 టికెట్ → ₹2000
₹1500 టికెట్ → ₹3000
₹1910 టికెట్ → ₹3500
₹2500 టికెట్ → ₹4500
₹4500 టికెట్ → ₹6000
₹7000 టికెట్ → ₹10,000
₹23,000 బాక్స్ టికెట్ → ₹30,000
₹30,000 కార్పొరేట్ బాక్స్ → ₹45,000

లక్షల సంఖ్యలో అభిమానులను క్యూ‌లో ఉంచి చివరకు “సోల్డ్ అవుట్” అని చూపించడం పారదర్శకత కాదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ డిమాండ్‌ను అవకాశంగా మార్చుకుని టికెట్ ధరలను పెంచుతున్నారని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

By
en-us Political News

  
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పల్నాడు జిల్లా పర్యటనలో ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి ఓవర్లలో షోర్నా అక్తర్ కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది. దీంతో 2004లో బంగ్లాదేశ్‌పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.
ఇందులో సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలపై కాలేజీలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత డిగ్రీ చివరి సంవత్సరం అంటే మూడో ఏడాదిలో విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెడతారు.
అయితే బస్సును సీజ్ చేసిన తర్వాత ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా ప్రయాణికులందరూ రాత్రంతా సీజ్ చేసిన బస్సులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నగరంలోని వీఆర్సీ సెంటర్ సమీపంలో, అలాగే రూరల్ పరిధిలో ఆమె ఒక పక్కా ప్లాన్ ప్రకారం నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని తన దందా సాగించింది.
బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ మరియు టాటా టియాగో ఈవీ కార్ల ధర, మైలేజ్ రేంజ్, బ్యాటరీ సామర్థ్యం మరియు సేఫ్టీ ఫీచర్ల పూర్తి వివరాలు మీకోసం.
ముంబై నగర తాగునీటి జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకరంగా 9 శాతానికి పడిపోయాయి. అప్పర్ వైతర్ణ డ్యామ్ పూర్తిగా ఎండిపోగా, ఐఎండీ జూన్ 22 నుండి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధుల నిరోధక గ్లోబల్ సంస్థ FATF వైస్ ప్రెసిడెంట్‌గా భారత ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ చారిత్రాత్మక నియామకం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.