బండి భగీరథ్‌ ఫోక్సో కేసులో మైనర్‌గా బాధితురాలి నిర్ధారణ

Publish Date:May 15, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దర్యాప్తులో కీలక అంశమైన బాధితురాలి వయస్సుపై స్పష్టత రావడం కేసును మరింత సీరియస్ దశలోకి తీసుకెళ్లింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బాధితురాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు జనన ధృవీకరణ పత్రం సమర్పించింది. ఆ పత్రాన్ని ఆధారంగా తీసుకుని సంబంధిత సంవత్సరానికి చెందిన జీహెచ్‌ఎంసీ జనన రికార్డులను పరిశీలించగా, ఆమె మైనర్ అని నిర్ధార ణ అయ్యింది. ఈ నిర్ధారణ కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఈ వ్యవహారం న్యాయపరంగా కూడా వేడెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఫోక్సో కేసు ఆరోపణల నేపథ్యంలో తన పేరు, ఫోటోలు, వీడియోలు భవిష్యత్తులో ఉపయోగించ కుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల్లో తన పేరుతో ప్రచారంలో ఉన్న వీడియోలను తొలగిం చాలని కూడా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోర్టును కోరారు. 

తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు..పోలీసుల దర్యాప్తు ఒక వైపు వేగంగా కొనసాగుతుండగా, మరోవైపు కోర్టు విచారణ ప్రారంభం కావడం కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. రాజకీయ స్పందనలు, సోషల్ మీడియా చర్చలు, న్యాయ పరమైన పరిణామాలు... అన్ని కలిసి ఈ కేసును రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఇకపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది? కోర్టు నుంచి వచ్చే తదుపరి ఆదేశాలు ఏమిటి? అనే  దానిపై ఆసక్తి నెలకొంది.

By
en-us Political News

  
చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ విభాగానికే చెందిన కానిస్టేబుల్‌కు భారీ శిక్ష పడింది.
బండి సంజయ్‌ తన కుమారుడిని వెంట తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్‌లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది.
తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేతపై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో, అధికారులు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొహెడ గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (జేజీఎఫ్)..
బండి భగీరథ్‌‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.