నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో వేధింపులు
Publish Date:Mar 10, 2026
Advertisement
మెగా కోడలు, టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అసభ్యకర ప్రచారంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదులో ఆమె పర్పుల్ క్రేయాల్ 00 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఖాతా ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్న లావణ్య త్రిపాఠీ, తప్పుడు ఆరోపణలతో తన ప్రతిష్టను దిగజార్చేలా నిరంతరం పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న ఈ వేధింపుల వల్ల తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నానని, ప్రశాంతత కోల్పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. పర్పుల్ క్రేయాన్ 00 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వివరాలు, ఐపీ అడ్రస్, ఇతర సాంకేతిక ఆధారాలతో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని త్వర లోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/on-line-harrasment-on-actress-lavanya-tripathi-36-215271.html





