ఐపీఎల్ లో రికార్డుల మోత.. 800ఫోర్ల క్లబ్ లోకి కోహ్లీ..9 వేల పరుగుల మైలురాయికి 11 పరుగుల దూరం

Publish Date:Apr 24, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 24) బెంగళూరు  చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరిగిన మ్యాచ్ లో పాత రికార్డులు బద్దలయ్యాయి. కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి.   స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ  చరిత్ర సృష్టించగా, మరోవైపు గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులను తిరగరాశాడు. అభిమానులకు కనువిందు చేసిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించారు. 

గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 58 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు.   ఈ క్రమంలోనే అతను ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా, సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి గిల్ ను వెనక్కు  నెట్టేశాడు.

మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సాయి సుదర్శన్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు లభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాననీ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం  ఆత్మవిశ్వాసాన్ని నింపిందనీ పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి తాను ఆడానని, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడం సంతృప్తిని ఇచ్చిందని అన్నాడు.  

ఇక కింగ్ కోహ్లీ  ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.  పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడా బౌలింగ్‌లో బౌండరీ కొట్టడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో కోహ్లీ తరువాతి స్థానాలలో శిఖర్ ధావన్ (768), డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653)  ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వీరుడుగా ఇప్పటికే కొనసాగుతున్న కోహ్లీ, ఇప్పుడు ఫోర్ల సంఖ్యలోనూ అగ్రస్థానానికి చేరడం విశేషం. అంతే కాదు ఐపీఎల్ లో 9 వేల పరుగుల మైలు రాయికి కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. తరువాతి మ్యాచ్ లోనే ఆ రికార్డు కూడా కోహ్లీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.  ఇక పోతే కింగ్ విరాట్ కోహ్లీ కేవలం ఫోర్లతోనే ఆగకుండా సిక్సర్ల విషయంలోనూ  ఘనత సాధించాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ 300 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గత 18 ఏళ్లుగా ఆర్సీబీకి కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  

By
en-us Political News

  
48 ఏళ్ల ఆసిఫ్ రజా వ్యాపారవేత్త ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి ఈ వినాశకర మిషన్‌ను ప్రారంభించాడు.
ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్‌కు చికిత్స అందిస్తోంది. ఆయనకు ప్రాథమికంగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
సాధారణంగా శబరిమల ఆలయ పరిసరాలను నో ఫ్లై జోన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఎటువంటి విమానాలు లేదా హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే, కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఎత్తులో పదేపదే చక్కర్లు కొట్టినట్లు భక్తులు, ఆలయ సిబ్బంది గుర్తించారు.
అమెరికా ప్రతినిధుల బృందంలో ట్రంప్ సన్నిహితుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉన్నారు. వీరిద్దరూ ఇస్లామాబాద్ చేరుకుని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ముఖాముఖి భేటీ అవుతారు. ఈ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది.
సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వడంతో, శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను గుజరాత్ నుంచి లాగేసుకున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.