గచ్చిబౌలిలో కల్తీ మాఫియా గుట్టు రట్టు.. ఇద్దరు అరెస్టు

Publish Date:Mar 9, 2026

Advertisement

సామాన్యులు నిత్యం వాడే వంటనూనె, గోధుమపిండి  కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాఫియా ముఠా గుట్టు రట్టైంది. గచ్చీబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో  ఎస్ఓటీ పోలీసులుగ జరిపిన సోదాలలో  21.9 లక్షల రూపాయల విలువైన కల్తీ నూనె, గోధుమపిండి స్వాధీనం చేసుకున్నారు.  

  శ్రీ జస్నాథ్ ట్రేడర్స్'పై  జరిపిన ఈ దాడిలో వివిధ కంపెనీలకు చెందిన గడువు ముగిసిన  అంటే డేట్ ఎక్స్ పైర్ అయిన  నూనెలను సేకరించి, వాటిని సోయాబీన్ ఆయిల్‌తో కలిపి కొత్త ప్యాకెట్లలో  నింపుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ఫేస్ లైట్, రాజాగోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా వంటి   పేర్లతో  మార్కెట్ లోకి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అలాగే ఈ సందర్భంగా 5,192 కిలోల గడువు ముగిసిన గోధుమపిండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.  ఈ కుళ్లిన గోధుమ పిండిని జస్నాథ్ గోల్డ్ చక్కి ఆటా పేరుతో రీ-ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ దాడుల సందర్భంగా రాజస్థాన్ కు చెందిన భన్వర్ రామ్ జాట్, అతడి కుమారుడు అశోక్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు.  వీరి వద్ద నుంచి 5,026 లీటర్ల నూనె, ఆయిల్ ఫిల్టరింగ్ మిషన్లు, ప్యాకింగ్ మెటీరియల్ ,  రవాణాకు వాడే టెంపో ట్రాలీని సీజ్ చేశారు.  

By
en-us Political News

  
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు.
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.