యుద్ధాల దారి యుద్ధాలదే: నోబెల్ మాత్రం నాదే.. ట్రంపరితనం మామూలుగా లేదుగా.!

Publish Date:Oct 8, 2026

Advertisement

ఈ సారి నోబెల్ శాంతి బహుమతి తనకే అంటున్నారు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్. తనకు నెబెల్ ఇవ్వకపోతే నోబెల్ కమిటీ పరువుపోతుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరిశీలకులు మాత్రం ట్రంపరి తనానికి ఇది పరాకాష్ట అంటున్నారు. తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు. 

నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రపంచం మొత్తం ఎవరి పేరు వస్తుందా అని ఎదురు చూస్తుంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకెవరి పేరో ఏంటి.. తన పేరే అని ధీమాగా చెబుతున్నారు.  నోబెల్ శాంతి బహుమతికి తనకు మించిన అర్హులెవరూ లేరని డంకా బజాయించి మరీ చెబుతున్నారు.  తనకు నోబెల్ శాంతి బహుమతి రాకుంటే.. నోబెల్ కమిటీ పరువు గంగలో కలిసినట్లేనని చెబుతున్నారు ట్రంప్.  

 అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనిమిది ఘర్షణలను పరిష్కరించానని ట్రంప్ చెప్పుకుంటున్నారు.  ప్రపంచంలో ఇంతకు ముందు ఏ అధ్యక్షుడూ చేయని పని తాను చేశానని ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు.  కే నోబెల్ శాంతి బహుమతి తనదేనని ఆయనకు ఆయనే ప్రకటించేసుకుంటున్నారు. 

 సాధారణంగా నోబెల్‌కు ఎవరైనా నామినేట్ చేస్తే..  నన్ను గుర్తించినందుకు ధన్యవాదాలు  అంటారు. కానీ ట్రంప్ మాత్రం  తనను నామినేట్ చేసే చాన్స్ ఎవరికీ ఇవ్వడం లేదు. నోబెల్ నాదే.. నాకు రావాల్సిందే అని తనకు తానే ప్రకటించేసుకుంటున్నారు. అదే  నామినేట్ చేయడం అనుకోమంటున్నారు. తనను తానే ప్రమోట్ చేసుకుంటూ.. తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వకుంటే నోబెల్ కమిటీ పరువుపోతుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నోబెల్ శాంతి పురస్కారం కోసం నోబెల్ కమిటీని బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. 

కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్‌ నేతలు తనను నోబెల్‌కు నామినేట్ చేశారని ఆయన చెప్పుకుంటున్నారు. వాస్తవానికి  నోబెల్ నామినేషన్లు గోప్యంగా ఉంటాయి. దీంతో ట్రంప్ చెప్పుకుంటున్నట్లుగా కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్ధాన్ దేశాలు ట్రంప్ ను నిజంగా నోబెల్ శాంతి పురస్కారం కోసం నామినేట్ చేశారనడం ధృవీకరణకు నిలవదు.  ఇక ట్రంప్ తనకు తాను  పరిష్కరించానని చెప్పుకుంటున్న ఘర్షణలు తలెత్తడానికే ట్రంప్ కారణమన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది.  

  ట్రంప్ శాంతి బహుమతి కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో.. 2026 జనవరిలో తన నోబెల్ పతకాన్ని ట్రంప్‌కు బహూకరించారు.  ఇదిగో.. మీకు కూడా నోబెల్ వచ్చేసింది  అన్నట్టుగా జరిగిన ఆ పరిణామాన్ని ట్రంప్ ఎంతో గౌరవంగా పేర్కొన్నారు. అయితే నోబెల్ బహుమతిని మరొకరికి బదిలీ చేయడం సాధ్యం కాదని నోబెల్ సంస్థ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో ట్రంప్ స్వయం ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టక తప్పలేదు.  

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటికీ శాశ్వత పరిష్కారం రాలేదు. మరోవైపు ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ ఘర్షణలు  కొనసాగుతున్నాయి. ట్రంప్ శాంతి ప్రయత్నాలుగా పేర్కొంటున్న కొన్ని పరిణామాలు పూర్తిగా ముగిసిన యుద్ధాలుగా పరిగణించడానికి వీలులేదు.  

ఇంతకీ నోబెల్ కమిటీ ఏం చేస్తుంది? అది ట్రంప్ చెప్పినట్టుగా  తనకు ఇవ్వకపోతే కమిటీకే పరువు పోయే’ స్థితిలో ఉందా? లేక ఎప్పటిలాగే తన ప్రమాణాల ప్రకారమే నిర్ణయం తీసుకుంటుందా? సమాధానం త్వరలోనే రానుంది. 2026 నోబెల్ శాంతిబహుమతి విజేతను నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం (అక్టోబర్ 9) ప్రకటించనుంది.

మొత్తానికి.. ప్రపంచంలో చాలామంది నోబెల్ కోసం ఎదురు చూస్తారు. ట్రంప్ మాత్రం నోబెల్ తన కోసం ఎదురు చూస్తోందని చెప్పుటుంటూ సొంత డబ్బా వాయించుకుంటున్నారు.  ప్రపంచ సంక్షోభానికి కారకుడిగా మారిన ట్రంప్ కు నోబెల్ వస్తే నిజంగానే నోబెల్ కమిటీ పరువు పోతుందని నెటిజనులు ఓ రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు. 

[Nobel Pace Prize, Donald Trump, America President, Over Enthusiasm, Wars, Ukraine, Russia, Iran, Isreal, Telugu One]

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు.
తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.