సీఈసీ అంశం: ఏకకాలంలో రాహుల్ కు అందివచ్చిన అవకాశం, పోలిటికల్ చాలెంజ్ కూడా.!

Publish Date:Oct 7, 2026

Advertisement

దేశ రాజకీయాలలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రంగా  ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఒకేు సమయంలో అందివచ్చిన అవకాశంగా, ఎదుర్కోవలసిన సవాల్ గా మారాయి.  కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాలు, నిర్ణయాలపై వెలువడుతున్న వార్తలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్,  ఇతర కమిషనర్ల మధ్య నెలకొన్న విభేదాలకు సంబంధించిన అంశాలు జాతీయ స్థాయిలో కలకలం రేపాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పౌరులు అత్యంత పవిత్రంగా భావించే ప్రాథమిక హక్కు. ఈ తరుణంలో ఎన్నికల సంఘం పనితీరు, దాని స్వయంప్రతిపత్తిపై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాలు, అనుమానాలు, ఆందోళనలను సరిగా అంచనా వేసి ముందుకు సాగాల్సిన గురుతర బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ పై ఉంది.  

  ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు రావడం సాధారణమేనని అధికార బీజేపీ, అలాగే ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి పార్టీలూ అంటున్నాయి. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ ఇస్తున్న సమర్థనలుఎంత మాత్రం సమంజసంగా లేవన్నది పరిశీలకుల విశ్లేషణ.  1993లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తీసుకువచ్చిన చట్టబద్ధమైన మార్పులను గనుక పరిశీలిస్తే.. 

అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు  నాటి ఎన్నికల సంఘం కమిషనర్  టీఎన్ శేషన్ సర్వాధికారాలను నియంత్రించడానికి బహుళ సభ్యుల ఎన్నికల సంఘం నిబంధనను తీసుకువచ్చారు. ఆప్పట్లో  శేషన్ తాను కేవలం ప్రజలకు, పార్లమెంట్‌కు, రాష్ట్రపతికి మాత్రమే బాధ్యత వహిస్తానని విస్ఫష్టంగా ప్రకటించారు. అయితే.. సుప్రీం కోర్టు బహుళ సభ్యుల ఎన్నికల సంఘం అన్న అప్పటి పీవీ ప్రభుత్వ నిర్ణయాన్ని  సమర్థించింది.  ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లకు సమానమైన అధికారాలు ఉంటాయని, అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ఓటు ద్వారా జరగాలని విస్పష్ట తీర్పు కూడా ఇచ్చింది. 

అయితే.. తరువాత తరువత  ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఈసీ స్థానాల్లో నియమించడానికి వివిధ మార్గాలను అన్వేషించాయి. 2009 జనవరిలో నాటి సీఈసీ ఎన్. గోపాలస్వామి అప్పటి ఈసీ నవీన్ చావ్లాకు రాజకీయ తటస్థత లేదంటూ ఆయనను తొలగించాలని రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉదంతాన్ని తీసుకుంటే..  అప్పటి  మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆయన్ను తొలగించకపోవడమే కాకుండా.. తదుపరి సీఈసీగా నియమించింది. ఇటువంటి పరిణామాలు గతంలోనూ జరిగినప్పటికీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 2023లో తీసుకువచ్చిన సరికొత్త చట్టం మాత్రం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి విషయంలో పెను మార్పులకు కారణమైంది. ఈ కొత్త చట్టం ప్రకారం, ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి దేశ ప్రధానన్యాయమూర్తిని తొలగించారు. అంతేకాకుండా, ఈసీ సభ్యులకు జీవితాంతం  న్యాయపరమైన విచారణల నుంచి సంపూర్ణ మినహాయింపు అంటే  ఇమ్యూనిటీ  కల్పించారు. 

ఈ నూతన చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో ప్రధాని, కేంద్ర కేబినెట్ మంత్రి,  లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మాత్రమే ఉంటారు. అయితే ప్రధాని,  కేబినెట్ మంత్రి ఎప్పుడూ ఒకే వర్గంగా ఉంటారు కాబట్టి..  ప్రతిపక్ష నేత పాత్ర నామమాత్రంగా మిగిలిపోతుంది.  ఇదే విషయంపై విపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ..  ఎటువంటి చర్చా లేకుండానే పార్లమెంటులో ఈ బిల్లుకు కేంద్రం ఆమెదముద్ర వేయించుకుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అప్పుడే కాదు, ఇప్పటికీ ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  ఇటీవల మీడియా సంస్థల కథనాల ద్వారా ఈసీ అంతర్గత విభేదాలు వెలుగులోకి రావడం, ఆ తర్వాత ఈ సంస్థ సమావేశమై కొన్ని నిర్ణయాలను ప్రకటించడం వంటి పరిణామాలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.

ఈ  తరుణంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు  రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడి గళమెత్తే అవకాశం లభించింది. ప్రభుత్వ విధానాలను, సంస్థలు స్వయంప్రతిపత్తి కోల్పోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆయన ఇప్పటికే ఒకింత విజయం సాధించారు. అయితే ప్రసంగాలలో విమర్శలకే పరిమితం కావడం కాకుండా.. బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళమెత్తి, బలంగా నిలబడే అవకాశాన్ని ఆయన ఎలా సద్వినియోగం చేసుకుంటారన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇక సవాల్ ఏమిటంటే.. బలమైన కార్యాచరణతో ఆయన ప్రజలను చైతన్య వంతం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిచడం.  ఎందుకంటే.. మెజారిటీ జనం.. తమ ఓటుహక్కు కోల్పోతామన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘంలో పారదర్శకతను డిమాండ్ చేస్తున్నారు. ఈ సానుకూల అవకాశాన్ని రాహుల్ గాంధీ ఏ మేరకు ఉపయోగించుకుని ప్రజా చేతనను బలమైన ఆయుధంగా మలచుకుంటారన్నది చూడాల్సి ఉంది. ఒకవైపు దేశ ప్రజలు ఓటు హక్కు పట్ల ఎంతో జాగరూకతతో ఉన్నందున, సంస్థల పారదర్శకతను కాపాడాలని కోరుకుంటున్నారు.

 అధికార పక్షం ఈ సంక్షోభాన్ని మరింత పెంచకుండా సద్దుమణిగేలా చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ఆందోళనలను అణచివేయడానికి బలప్రయోగానికి కూడా వెనుకాడటం లేదు. రాహుల్ గాంధీ ఈ తరుణంగా గట్టిగా నిలబడి ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాల్సి ఉంది. ఈ విషయంలో ఆయన సాధించే విజయమే, ఆయన రాజకీయ భవిష్యత్ ను, అలాగే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది.  ఈ విషయంలో ఆయన విజయంసాధిస్తేనే..  జాతీయ రాజకీయాల్లో ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు ఇండియా కూటమి పార్టీలు ముందుకు వస్తాయి.   

[Election Commission ssue A Big Challenge, Rahul Gandhi, Congress, Political Future, Modi Government Law, Chief Election Commissioner, Indian politics, PV Narasimharrao, TN Seshan, Telugu One]

By
en-us Political News

  
లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే వైసీపీ అంగీకారం తెలిపింది.  కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రాతినిధ్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందనీ, అందుకు భిన్నంగా 50శాతం పెంపునకు కేంద్రం ఓకే అంటే డీలిమిటేషన్ బిల్లుకు ఓకే అని వైసీపీ అధినేత ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు పెచ్చరిల్లేలే చేయడానికి, తద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ లబ్ధి పొందడానికి నానా కష్టాలూ పడ్డారు. అయితే అవేం ఫలించలేదు అది వేరే సంగతి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్, బీఆర్ఎస్ అధినాయకత్వం మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనడానికే.
దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో  ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం,   బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు.
తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 27 స్థానాలలో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కు కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది. 
జగన్ తన పాదయాత్రను వచ్చే ఏడాది మార్చి నుంచే ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచే జగన్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.