మనం చేసే పొదుపు, భవిష్యత్తు తరాలకి అందించే బహుమతి...జాతీయ ఇంధన పరిరక్షణా దినోత్సవం 2024!

Publish Date:Dec 14, 2024

Advertisement

 

శరీరానికి నీరు ఇంధనం వంటివి అని చెబుతారు. ఒక వాహనానికి ఇంధనం ఎంత అవసరమో.. మనిషి శరీరానికి నీరు అంతే అవసరం. శరీరానికి నీరు బాగా లభిస్తేనే శరీరంలో అవయవాలు బాగా పని చేస్తాయి. అట్లాగే మనిషి జీవితంలో బోలెడు కార్యకలాపాలు సాగడానికి ఇంధనాలు అవసరం అవుతాయి. ప్రకృతి ఇచ్చిన సహజ వనరులతో పాటు.. చాలా రకాల ఇంధనాలు మనిషి రోజువారీ జీవిత కార్యకలాపాలకు అవసరం. కొన్ని వనరులను ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చగలం తప్ప సృష్టించలేము అనే విషయం తెలిసిందే. ఇలా వనరుల మీద అవగాహన పెంచి మానవ మనుగడను ఇబ్బందులలో పడకుండా ఉండేందుకు అందరికీ అవగాహన కల్పించే దిశగా ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని గూర్చి మరింతగా తెలుసుకుంటే..

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం..

1991వ సంవత్సరం డిసెంబర్ 14న, మొదటిసారి  మన భారతదేశంలో ‘జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని’ జరుపుకున్నారు. 2001 ఎనర్జీ కన్జర్వేషన్ యాక్టులో  భాగంగా  ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ’ (BEE) స్థాపించబడింది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఇంధనం   పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించడానికి  వ్యక్తులు, పరిశ్రమలు,  ప్రభుత్వ సంస్థలు వినియోగించే శక్తి వృధా కాకుండా చూడటం, పచ్చదనంతో కూడిన వాతావరణాన్ని పెంచడం,   ఇంధన-పొదుపు పద్ధతులను అనుసరించేలా ప్రోత్సహించడమనే విషయాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది.  ఈ దినోత్సవాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ అవగాహన ప్రచారాలు, అవార్డు వేడుకలు, వ్యక్తిగత, సంస్థాగత స్థాయిలలో శక్తి పరిరక్షణా  ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాల రూపంలో జరుపుతుంది.

 థీమ్..

"పవరింగ్  సస్టైనబిలిటీ: ఎవ్రీ వాట్ కౌంట్స్”. ఈ థీమ్ స్వల్ప స్థాయిలోనైనా ఇంధన సంరక్షణలో వ్యక్తిగత, సామూహిక ప్రయత్నం చేయటంలో ఉన్న  కీలక పాత్రను నొక్కి చెబుతుంది. వ్యక్తులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు స్థిరమైన ఇంధన పొదుపు  పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 

 ప్రాముఖ్యత..

బాధ్యతాయుతంగా ఇంధనాలను ఉపయోగించుకోవాలనే ఆలోచన పెంచి,  పెరుగుతున్న ఇంధన డిమాండ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఇంధన పొదుపు పద్ధతుల వైపు మళ్లేలా వారిని ప్రోత్సహించడమే  దీని ప్రత్యేకత.  

ఇంధన పొదుపు  ప్రాముఖ్యతపై వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలకు అవగాహన కల్పిస్తుంది.  

స్థిరమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.  శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించవలసిన విషయాన్ని నొక్కి చెప్తుంది.  ఇంధన భద్రతను సాధించాలనే మన  భారతదేశ లక్ష్యానికి మద్దతు ఇస్తుంది. 

పర్యావరణం దెబ్బతినటానికి కారణమవుతున్న  కార్బన్ ఫుట్ ప్రింటుని వీలైనంతవరకూ  తగ్గించాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తుంది.  

ప్రభుత్వాలు, సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా, ఎంతలా మనకి పొదుపు గురించి చెప్పినా కూడా చివరికి ఫలితం రావటమనేది ప్రతీ వ్యక్తి చేతిలో ఉంటుంది. వ్యక్తిగతంగా మనం ఎంతవరకూ దాని కోసం పని చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మన  ఇంట్లో అవసరం లేకుండా వెలిగే ఒక లైటునో, తిరుతున్న ఒక ఫ్యానునో ఆపకుండా బయటకి వచ్చి పర్యావరణం గురించి, కాలుష్యం గురించి మాట్లాడటం వింతగా ఉంటుంది కదా.. అందుకే ఇంధన పొదుపుకి ఉన్న ఆవశ్యకత, అవసరం తెలుసుకుని, దానికి తగిన చర్యలు మన ఇంటినుంచి  మనమే మొదలుపెట్టాలి.  పౌరులంతా బాధ్యతగా ప్రవర్తిస్తే ఇదేమీ అసాధ్యం కాదు... ఈ రోజు మనం ముందడుగు వేయకపోతే మన భవిష్యత్తు తరాలకి అందాల్సిన శక్తివనరులని మనమే హరించి, చేతులారా మనమే వారి జీవితాలని నరకం చేసినవాళ్లమవుతాం....


                             *రూపశ్రీ 

By
en-us Political News

  
అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచికరమైన పెసరపప్పు హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
గ్రీన్ మటన్ కర్రీని పచ్చి మసాలాలు, పచ్చిమిర్చి మరియు కొబ్బరి పేస్ట్ తో అత్యంత రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
దీపావళిలో టపాసులు పేలేటప్పుడు కంటికి గాయాలైతే తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్స గురించి తెలుసుకోండి.
బేరి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ మరియు మధుమేహం అదుపులో పియర్ ఫ్రూట్ ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు.
అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసి తింటున్నారా? రీహీటెడ్ రైస్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం మరియు పాటించాల్సిన 24 గంటల రూల్ గురించిన పూర్తి వివరాలు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ వంట నూనెలు ఉత్తమమైనవి? కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి నూనెలను ఏ విధంగా వాడాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్ క్రీమ్స్‌కు బదులుగా 800 ఏళ్ల నాటి ఆయుర్వేద నిపుణులు సూచించిన జాజికాయ, ములేఠీ పేస్ట్ చిట్కాతో సహజంగా మెరిసే కళ్లను సొంతం చేసుకోండి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, డయాబెటిస్ ముప్పును నివారించడానికి కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్న 4 హానికరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి.
మినుములు లేదా మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో తెలుసా? ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే మినుములు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, ఎముకలను బలంగా మార్చి, కీళ్ల నొప్పులు మరియు ఉబ్బసానికి ఎలా చెక్ పెడతాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
నడుము నొప్పితో బాధపడుతున్నారా? వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మరియు నడుము నొప్పిని తగ్గించడానికి పాటించవలసిన 5 అత్యవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు కాదంటూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు సంచలన విషయాలు వెల్లడించాయి. సగటు ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి బాణసంచా పొగ వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి. N95 మాస్క్ వినియోగం, AQI తనిఖీ మరియు తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్.
ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.