మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల పరిశీలకులను ప్రకటించిన బీఆర్‌ఎస్

Publish Date:Feb 16, 2026

Advertisement

 

మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు, కుట్రల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. రేపు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్-ఛార్జిలను నియమించారు. ఈ మేరకు ఆయన ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు ఇన్-ఛార్జిలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. 

స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమ కిడ్నాప్‌లు, బెదిరింపులు మరియు పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్, పార్టీ పార్టీ స్థానిక నాయకత్వానికి అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాలా అండగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్-ఛార్జిలుగా పంపుతున్నట్లు ప్రకటించారు. 

ఆయన ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు. రేపు ఎన్నికలు జరగనున్న 8 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ స్పష్టంగా ఛైర్మన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉన్నందున, ఈ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ ఎనిమిది మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినా తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని పార్టీ ధీమా వ్యక్తం చేసింది.

ఆయా మున్సిపాలిటీలకు నియమించబడిన ఇన్-ఛార్జిల వివరాలు :

తోర్రూర్ : ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ 

జనగామ : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మరియు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
 
క్యాతనపల్లి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
 
ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
 
కాగజ్ నగర్ : మాజీమంత్రి జోగు రామన్న

జహీరాబాద్: ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి
 
ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

By
en-us Political News

  
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిణామాల మధ్య, ఇరాన్‌తో నేరుగా లేదా పరోక్షంగా చర్చలు జరపడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని అమెరికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గెలుస్తామో లేదో తెలియని యుద్ధాన్ని కొనసాగించేకంటే.. ఏదో ఒకలా ఏదో మేరకు శాంతి కుదిరితే అదే పదివేలన్న భావనలో అమెరికా ఉందన్న చర్చ అంతర్జాతీయ రాజకీయ వేదికలపై జోరుగా సాగుతున్నది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనే ధ్యేయంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్ పథకం.. ఇప్పుడు లక్షలాది మంది ఆకలి తీరుస్తూ ఒక సామాజిక విప్లవంగా మారింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో డాలర్ భవిష్యత్తుపై చేసిన విశ్లేషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బ్రెజిల్, చైనా వంటి దేశాలు తమ పరస్పర వాణిజ్యం కోసం డాలర్‌ను పక్కన పెట్టి, సొంత కరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి గనుక మరో ఐదేళ్ల పాటు కొనసాగితే.. ప్రపంచ దేశాలకు అమెరికా డాలర్‌తో అవసరం తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది.
వచ్చే 5 సంవత్సరాల్లో అనేక దేశాలు డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. అదే కనుక జరిగితే.. అమెరికా ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే శక్తి గణనీయంగా తగ్గిపోతుంది.
గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సుదీర్ఘంగా మూడు నెలల పాటు పరిశీలించి, అది తప్పుడు కేసు అని తేల్చిచెప్పిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించగానే కేవలం తొలి రోజే ఆ తీర్పును పక్కనపెట్టేలా జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యవహరించారని ఆరోపించారు. కేవలం మూడు విచారణలతోనే నిందితులందరినీ అవినీతిపరులుగా ముద్ర వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.
ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండి, ఆర్థికంగా వెనుకబడిన లేదా సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విధుల్లో చేరకముందే ఈ బాధితులను గుర్తించి, ఒక పద్ధతి ప్రకారం వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
మానసిక , మతపరమైన ఒత్తిడికి గురి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒకటని కాదు.. పలు విధానాల ద్వారా బాధితులను వీరి వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. హిందూ ధర్మంపై విమర్శలు, అవమానకర వ్యాఖ్యలు, ఆహారపు అలవాట్లలో బలవంతపు మార్పులు అంటే బీఫ్ తినమని ఒత్తిడి చేయడం, అలాగే మతాచారాలను మార్చుకోవాలని అంటే నమాజ్ చేయమని తీవ్ర ఒత్తిడి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ ప్రచారంపై హైడ్రా అధికారులు వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసు పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు తప్పుడు సమాచారం చేస్తున్నారని తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.