చంద్రబాబు అన్నలాంటోడు... కాకా పడుతున్న ఎంపీగారు...
Publish Date:Dec 4, 2017
Advertisement
మొన్నటి వరకూ చిందులు వేసిన టీడీపీ ఎంపీ శివప్రసాద్ టోన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చంద్రబాబును కాకా పట్టే పనిలో పడినట్టు తెలుస్తోంది. కానీ ఎంపీగారు పప్పులు చంద్రబాబు దగ్గర ఉడకడం లేదు. దీనికి కారణం ఆయన చేసిన ఓవరాక్షనే కారణం. చంద్రబాబు, శివప్రసాద్ ఇద్దరూ సన్నిహితులు. దాంతోనే శివప్రసాద్ కు చంద్రబాబు ముందు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ తరువాత ఏకంగా... ఎంపీ గా చేశారు. అయితే ఆ తరువాతే ఎంపీగారు కాస్త ఎక్కువ చేయడం మొదలుపెట్టారు. వ్యక్తిగత డిమాండ్స్ తీరలేదన్న కోపంతో పార్టీ ని ఇబ్బంది పెట్టే చర్యలకు దిగారు. కొన్ని సభలు , వేదికల మీదే సొంత పార్టీపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీనే ఇరకాటంలో పెట్టారు. ఆయన్ను బుజ్జగించడానికి ప్రయత్నించిన నేతల మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయం బాబు చెవిన పడడంతో ఆయన కూడా శివ ప్రసాద్ తో మాట్లాడినా ఎంపీ గారి ధోరణి మారలేదు సరికదా వైసీపీ కి వెళుతున్నట్టు పార్టీని బెదిరించే సంకేతాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది.... వైసీపీ పరిస్థితి ఏంటో బాగ అర్ధమైనట్టుంది. ఇప్పుడు రూట్ మార్చారు. చంద్రబాబు నాకు అన్నలాంటి వాడు అని పెద్ద డైలాగ్సే వాడుతున్నాడు. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన... చంద్రబాబు, తాను ఆరోతరగతి నుంచి 11వ తరగతి వరకు కలిసి చదువుకున్నామని..అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఆయనను సొంత అన్నలా భావిస్తానని ఆయన చెప్పారు.తమ మధ్య గ్యాప్ అన్న ప్రశ్నే లేదని ఆయన తెలిపారు. తాను అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వకపోవడం అన్నది ఇంతవరకు జరగలేదని, అయితే ఒకసారి మూడు గంటలు ఆలస్యమైందని ఆయన చెప్పారు. తాను ఫోన్ చేశానని చెబితే అటునుంచి అరగంటలోపు ఫోన్ వస్తుందని ఆయన తెలిపారు. అలాంటి తమ మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తరువాత బోలెడు సమీకరణాలు ఉంటాయని, ఆయనపై చాలా బాధ్యతలు ఉంటాయని అన్నారు. వాటికి అనుగుణంగా ఆయన పని చేస్తుంటారని చెప్పారు. మొత్తానికి శివప్రసాద్ గారికి తెలిసొచ్చినట్టు ఉంది. ఎక్కువ ఎగిరితే..తనకు నష్టం జరగొచ్చు అన్న అనుమానం వచ్చిందేమో..అందుకే చంద్రబాబును ఏకంగా అన్నా అని కాకా పడుతున్నాడు. మరి ఎంపీగారి మాటలకు చంద్రబాబు మెత్త బడతారా.. లేదా..? చూద్దాం....
http://www.teluguone.com/news/content/mp-siva-prasad-45-79097.html





