మావోయిస్టు గణపతి లొంగుబాటుపై ఢిల్లీలో ప్రచారం!

Publish Date:Mar 11, 2026

Advertisement

 

దేశంలో దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన సీపీఐ (మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి త్వరలో లొంగిపోవచ్చననే వార్తలు రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోవచ్చననే ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది. దాదాపు 50 ఏళ్ల పాటు సీపీఐ మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన గణపతి, ఇటీవల అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కాగర్ తరువాత ఆయన నేపాల్‌లో ఆశ్రయం పొందినట్లు ప్రచారం జరిగింది. 

అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారన్న వార్తలతో ఆయన లొంగుబాటు అంశం మరింత వేడెక్కింది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా గణపతి సాధారణ జీవితం గడపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యం లోనే గణపతి తెలంగాణ పోలీసులతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబు తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఆయన ఉద్యమ జీవితానికి ముగింపు పలికి సాధారణ జీవితం గడపాలని కోరు తున్నట్లు చెపుతున్నారని సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం గణపతితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గణపతి లొంగుబాటు జరిగితే మావోయిస్టు ఉద్యమానికి ఇది పెద్ద దెబ్బగా మారే అవకాశముంది. అగ్ర నాయ కుల యుగానికి ముగింపు పలికే పరిణామంగా ఇది నిలుస్తోంది. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్‌లో జన్మించిన గణపతి, అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. ఉద్యమంలో ఆయనను సహచరులు “టీచర్” అని పిలిచేవారు. 1970 దశకం లో జగిత్యాల ప్రాంతంలో జరిగిన రైతాంగ పోరాటాల ద్వారా గణపతి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తరువాత కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి నాయ కుడిగా ఎదిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

2018లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఆయన వైదొలి గారు. అయితే మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో గణపతి కీలక పాత్ర పోషించినట్లు భద్రతా సంస్థలు చెబుతు న్నాయి. ఆయన పర్యవేక్షణ లో దేశంలోని పలు సంచలన దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం గణపతి భార్య సుజాత కూడా ఉద్యమంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. గణపతి స్వస్థలం ప్రస్తుతం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల పరిధిలోని ప్రాంతంగా గుర్తించబడింది. ఇక గణపతి లొంగుబాటుపై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు. అయితే ఈ వార్తలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

By
en-us Political News

  
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్‌ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
బయో గ్లాస్ మోడల్‌లో 12 రకాల విభిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇది వినియోగదారుడి కండరాల సంకేతాలను లేదా ముందే ప్రోగ్రామ్ చేసిన ఏఐ కమాండ్స్‌ను అర్థం చేసుకుని, వస్తువులను పట్టుకోవడం, రాయడం, చేయిని వివిధ దిశల్లో తిప్పడం వంటి పనులను అతి సులువుగా చేయగలదు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ లా చాలా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం పోలీస్ లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు.
మధ్యప్రాచ్యంలో శుక్రవారం ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది.
ఐఆర్జీసీ సమాచారం మేరకు నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థలు దానిని కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది.
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో జనం ఉక్కపోతతో, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. అసలే భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న ఏపీ జనాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోతాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్లులు విస్తాయనీ ప్రకటించింది.
ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించింది. అమెరికా స్థావరాలు, జెట్లు లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. గురువారం అమెరికా ఇరాన్ కు 48 గంటల కాల్పుల విరమణ శాంతి ప్రతిపాదనను పంపింది. ఆ ప్రతిపాదనకు సమాధానమా అన్నట్లు ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.
ఢిల్లీతో సహా పంజాబ్‌లోని నోయిడా, ఛండీగఢ్‌, లూధియానాలో భూమి కంపించింది. అలాగే పూంచ్, శ్రీనగర్, ఉదమ్‌పూర్, జమ్ము కశ్మీర్‌లోనూ భూమి కంపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.