హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానికి తప్పిన పెను ప్రమాదం

Publish Date:Mar 11, 2026

Advertisement

 

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్లిన ఒక ప్రయాణికుల విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్  కు చెందిన బోయింగ్ 737 విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  లో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆందోళ నకర పరిస్థితి నెలకొంది.హైదరాబాద్ నుంచి థాయ్‌ లాండ్‌కు బయలుదేరిన ఈ విమానం ఈరోజు బుధవారం ఫుకెట్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ముందు భాగంలోని నోస్ వీల్ (ఫ్రంట్ ల్యాండింగ్ గేర్) ఊడిపోయింది.

దీంతో విమానం రన్‌వేపై స్థిరంగా నిలవలేక కొంతదూరం పక్కకు జారింది. అదే సమయంలో వెనుక భాగంలోని ఒక టైర్ కూడా పేలిపో యినట్లు అధికారులు తెలిపారు. అయితే పైలట్ సమయస్ఫూర్తితో విమానాన్ని అదుపులోకి తీసుకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం వేగం తక్కువగా ఉండటం కూడా ప్రయాణికులకు పెద్ద ప్రమాదం జరగకుండా సహాయపడింది. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 133 మంది ప్రయా ణికులు ఉన్నట్లు అధికా రులు వెల్లడించారు.

అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టి ప్రయాణి కులను సురక్షితంగా విమానం నుంచి కిందకు దింపారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూ సురక్షితంగా బయటపడారని ప్రయాణికులు, అధికారులు పైలట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఘటనపై సాంకేతిక నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న దానిపై విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో కొంతసేపు ఫుకేట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  రన్‌వే కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.