డబ్బుకు కళ్లెం వేయండి ఇలా…!!

Publish Date:Apr 28, 2022

Advertisement

నెల చివరికి వచ్చిందంటే చాలామంది జేబులు కాళీ అవుతాయి. ఇంకా నెల నెలా జీతం తీసుకునే వాళ్ళ ఇళ్లలో అయితే పది రూపాయలు కావాలన్నా వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.  ఏవైన అత్యవసర ఖర్చులు వచ్చాయంటే నెల చివరలో సతమతమైపోతారు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చేది అలాగే. కానీ వీటి గూర్చి ఎవరూ పెద్దగా ఆలోచన చేయరు. ఫలితంగా నెల చివర్లో ఆర్థిక ఇబ్బంది. నెల మొదట్లో, నెల మధ్యలో పిల్లల ఇష్టాలు, అవసరాలు తీర్చినట్టు, కుటుంబం గడిపినట్టు నెల చివర గడపలేము. అయితే వీటన్నిటికీ సులువైన మార్గాలున్నాయి.

పక్కా ప్లానింగ్ వేసుకుంటే నెల మొత్తం ఓకేలాగా 100%  కాకపోయినా తృప్తి పడేలాగా గడిపేయచ్చు.

సాలరీ రాగానే కట్టాల్సివన్నీ కట్టేస్తాం. ఆ తరువాత మిగిలేది కాస్తో కూస్తో. అయితే దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు పెద్దగా ప్రాధాన్యత లేకున్నా చేతిలో డబ్బులున్నాయని షాపింగ్ కు వెళ్లడం, బయట రెస్టారెంట్లకు వెళ్లడం. ఏదో నచ్చిందని, మరేదో తక్కువ ధరకు ఆఫర్ లో వస్తుందని. ఇలా కారణాల వల్ల కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. నిజానికి వీళ్లే నెలచివర్లో ఇబ్బంది పడుతుంటారు కూడా.

కట్టడి కాదు కట్టుబడి!!

నిజమే!! చాలామంది ఖర్చుల విషయంలో కట్టడి చేసుకోవాలి అనుకుంటారు. అయితే కట్టడి కాదు చేయాల్సింది. కట్టుబడి ఉండటం. ప్రణాళికలో భాగంగా దేనికి ఎంత పెట్టాలి?? ఎంత అవసరం?? ఎంత ఖర్చుపెడుతున్నాం ఇలాంటివి ఆలోచించుకోవాలి. చేతిలో పైసా ఉంటే ఏదో ఒకటి కొనేయలని అనిపిస్తుంది.

ఆన్లైన్ తో పడుతూ లేస్తూ!!

ఆన్లైన్ లో  నగదు చెల్లింపులు వచ్చాక అంతా సులభం అయిపోయింది, సమయం ఆదా అయింది. కానీ డబ్బును మాత్రం చాలా సులువుగా ఖర్చుపెట్టేస్తున్నారు. ఒకప్పుడు డబ్బు అవసరం అయితే నాన్న బ్యాంక్ కు వెళ్ళాలి, క్యూలో నిలబడాలి, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడు దాన్ని అమ్మ ఏ డబ్బాలోనో, లేక బీరువాలోనో దాచి రూపాయి రూపాయి లెక్కబెట్టి మరీ బయటకు తీసేస్తుంది. అపుడు నెల చివర వచ్చినా ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ముఖ్యంగా అమ్మ పోపుల డబ్బాకు ఉన్న పవర్ అదేమో అనుకునేవాళ్ళం కూడా. కానీ అదంతా మనుషుల జాగ్రత్త కదా!!

సేవింగ్స్ సర్వింగ్స్!!

ప్రతి నెల సంపాదనలో సేవింగ్స్ అంటూ కొన్ని ఉంటాయి. వాటిని కూడా నేల నెల కట్టేస్తారు. అయితే వచ్చే తిరకాసు ఒకటే. నెల నెలా సేవింగ్స్ కంటే ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి పెద్ద మొత్తంలో కట్టాల్సి ఇన్సూరెన్స్ పాలసిలు  సినిమా చూపిస్తాయి.  అందుకే వాటికోసం ప్రతినెలా కొంత మొత్తం పక్కనపెట్టాలి. తద్వారా అవి భారం అవ్వవు.

పొదుపు మంత్రం భవిత బంగారం!!

పొదుపు పొదుపు అని తల తినేస్తున్నారేంటి అనిపిస్తుంది. కానీ పొదుపు అనేది పెద్దలకు కాదు పిల్లలకు కూడా. ఇంట్లో పిల్లలకు ఓ పిగ్గి బ్యాంక్ ఇచ్చి చూడండి. వాళ్ళ అనవసర ఖర్చులు పోయి సేవింగ్స్ లోకి జర్నీ స్టార్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే అలా పిల్లల సేవింగ్స్ ఏ పెద్దలను ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది కూడా. పొదుపు గురించి కొంత అవగాహన దాని రుచి తెలిసాక అనవసర ఖర్చులు చేయకుండా ఎంతో జాగ్రత్త పడతారు. పొదుపంటే పిసినారితనం కాదని, అది కూడా ఒక కళ అని తొందరలోనే గుర్తిస్తారు.

లోకమంతా డబ్బులో కొట్టుమిట్టాడుతున్నపుడు, డబ్బుకు ఈ లోకమే దాసోహం అయినపుడు డబ్బు విషయంలో జాగ్రత్త ఉంటూ దాన్ని ఎలా వాడాలో, మనకు కష్టం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తే తప్పేమీ లేదు, మనం, ముఖ్న పిల్లలు దాన్ని ఆచరణలో పెడితే అస్సలు తప్పు లేదు!!

 

◆ వెంకటేష్ పువ్వాడ

 


 

By
en-us Political News

  
పండుగ వేళల్లో ఇష్టమైన వంటకాలు ఎక్కువగా లాగించడం వల్ల తీవ్రమైన ఎసిడిటీ మరియు ఛాతీలో మంట వస్తుందా? ఎసిడిటీకి కారణమయ్యే ఆహార పొరపాట్లు మరియు వాటిని నివారించే సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
స్మార్ట్‌వాచ్‌లో గుండె వేగం సాధారణంగా ఉన్నప్పటికీ పక్షవాతం (Stroke) వచ్చే అవకాశం ఉందా? వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు, స్ట్రోక్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు తెలుసుకోండి.
టీ మరియు కాఫీలలో ఆరోగ్యానికి ఏది మంచిది? రీసెంట్ స్టడీ రిపోర్ట్ ప్రకారం టీ, కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు మరియు ఎముకల ఆరోగ్యంపై పడే ప్రభావం పూర్తి వివరాలు తెలుసుకోండి.
క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ప్రోటీన్లు కంతులను సులువుగా గుర్తించేలా చేసినప్పటికీ, రోగనిరోధక దాడి నుంచి ఎలా తప్పించుకుంటున్నాయో తెలిపే తాజా వైద్య పరిశోధనా విశేషాలు.
చలిగాలులు వీచినప్పుడు కళ్ల నుంచి నీరు ఎందుకు కారుతుంది? ఇది డ్రై ఐ సమస్య లేదా అలర్జీనా అనే పూర్తి వివరాలు, కారణాలు మరియు నివారణ మార్గాలను తెలుసుకోండి.
పిల్లలతో అనుబంధం అనేది కేవలం రక్త సంబంధానికి మాత్రమే పరిమితం కాదు. అది పరస్పర నమ్మకం, భావోద్వేగాల కలయికపై ఆధారపడి ఉంటుంది.
ఉదయం నిద్రలేవగానే పరగడుపున నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, జీర్ణక్రియ మెరుగుపడటం, హైడ్రేషన్ మరియు కిడ్నీల ఆరోగ్యంపై నిపుణుల సలహాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
మధుమేహాన్ని సహజంగా నియంత్రించే అద్భుతమైన దేశీయౌషధం కానుగ పువ్వు పొడి గురించిన పూర్తి వివరాలు. టైప్ 1, టైప్ 2 షుగర్ లెవల్స్‌ను తగ్గించే ఈ ఇంటి చిట్కా ప్రయోజనాలు, తయారుచేసే విధానం తెలుసుకోండి.
బెండకాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? షుగర్, కొలెస్ట్రాల్, జీర్ణశక్తిపై డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు మరియు తయారుచేసే సరైన విధానం ఇక్కడ తెలుసుకోండి.
శరీరంపై కొవ్వు గడ్డలు లేదా లిపోమా సమస్యతో బాధపడుతున్నారా? సర్జరీ లేకుండా సహజమైన ఇంటి చిట్కాలు, ఆహారపు అలవాట్లు మరియు ఆయుర్వేద మార్గాల ద్వారా కొవ్వు గడ్డలను ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.