నెలరోజుల్లో ఎంత మార్పు..!

Publish Date:Aug 10, 2016

Advertisement

నెల రోజుల క్రితం మందిమార్భలంతో..రాజదర్పంతో రాష్ట్రాధినేతగా ఏ బంగ్లా నుంచి బయటకు వచ్చారో..సరిగ్గా నెల తిరిగే సరికి అదే బంగ్లాలో ఆయన శవమై కనిపించారు. ఇది ఎవరి కథో ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖ్ పుల్ అసాధారణ రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న ఉదయం రాజధాని ఇటానగర్‌లోని తన అధికారిక నివాసంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని పుల్ ఆత్మహత్య చేసుకున్నారు. సినీ వినీలాకాశంలో తారలుగా వెలుగొందాలని గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, అవకాశాలు రాకపోవడంతో ఇక్కడ ఇమడలేక తనువు చాలించిన ఎంతోమంది తారలను మనం చూశాం. కానీ స్వతంత్ర భారతచరిత్రలో ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం మనదేశంలో విచిత్రమైన..విషాదం.

 

అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతం అంజాప్ జిల్లాలో 1969 జూలై 20న జన్మించిన పుల్ హ్యూమానిటీస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వడ్రంగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో రాజకీయాల్లోకి ప్రవేశించి హయులియాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి విజయంతోనే సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2015 డిసెంబర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం పుల్ జీవితాన్ని మలుపుతిప్పింది. ప్రజాధనాన్ని నబుంటుకీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ కలిఖోపుల్ బహిరంగంగా విమర్శలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఎం నబుంటుకీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీ మద్ధతుతో డిసెంబర్ 17, 2015న అరుణాచల్‌ప్రదేశ్ ఎనిమిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పుల్.

 

అనంతరం రాష్ట్రపతి పాలన విధించడం, పుల్ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ ఏడాది జూలై 13న పుల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, నబుంటుకీ ప్రభుత్వాన్ని పునరుద్దరిస్తూ తీర్పు చెప్పింది సుప్రీం. దీంతో సీఎం పదవి నుంచి పుల్ గత నెలలోనే తప్పుకున్నారు. ఆయన సొంత నివాసానికి పునరుద్దరణ పనులు జరుగుతుండటంతో ఇటానగర్‌లోని ప్రభుత్వ నివాసంలోనే ముగ్గురు భార్యలు, నలుగురు బిడ్డలతో కలిసి జీవిస్తున్నారు. త్వరలోనే ఆ ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంది. సుప్రీం తీర్పు వచ్చినప్పటి నుంచి కాస్త ముభావంగా ఉంటున్న పుల్ గత వారం రోజుల నుంచి బయటి వ్యక్తులను కలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. చివరిసారిగా కాంగ్రెస్ సభ్యుడు నినాంగ్ ఎరింగ్‌తో మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుల్ ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదు. ఒక డైరీ దొరకడంతో పోలీసులు దానిని పరిశీలిస్తున్నారు.

 

కలిఖోపుల్ ఆత్మహత్య విషయం తెలియగానే ముఖ్యమంత్రి పెమా ఖండూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్యకు కారణాలపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి నాయకుడి అంతిమ లక్ష్యం పదవి. దాని కోసం ఎన్ని అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా తుది వరకు పోరాడుతారు లేదంటే రాజకీయాల నుంచే తప్పుకుంటారు. కానీ అవమానం జరిగిందని..కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడరు. అలా అయితే దేశంలో పదవులు కోల్పోయిన వారందరి పరిస్థితి ఏంటి..? వడ్రంగిగా జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పుల్ తన జీవితంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని ఉంటారు. అలాంటి వ్యక్తి ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తారా..?

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.