అప్పుడు ఆయన..ఇప్పుడు ఈవిడ..?

Publish Date:Aug 10, 2016

Advertisement

మనదేశంలో అన్ని పనులకు, ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉంది గానీ రాజకీయాలకు లేదు. అందుకే తొంభైలకి దగ్గరవుతున్నా చాలా మంది నేతలు కుర్చీలను పట్టుకుని వేలాడుతున్నారు. మరేంతో మంది కుర్చీ కోసం తహతహలాడుతున్నారు. వారి పరిస్థితి అలా ఉంటే మరి కొందరేమో అల్రెడీ కుర్చీల్లో ఉన్నా తమను తప్పించండి మహా ప్రభో అంటూ అధినేతలను వేడుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. వయోభారం కారణంగా చూపి ఆమె పదవి నుంచి తప్పుకున్నారు. ఆనందీ..బీజేపీలో సీనియర్ నాయకురాలు..ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆమె చెప్పిన కారణం కూడా ఈ సీనియారిటీనే..75 సంవత్సరాలు నిండిన వాళ్లు కీలక బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలన్నది బీజేపీ అభిమతం.

 

2014లో మోడీ అధికారంలోకి వచ్చి రాగానే బీజేపీ అగ్రనేతలు..ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహార్ జోషి, శాంతకుమార్, యశ్వంత్‌సిన్హా వంటి సీనియర్ నాయకులకు పదవులు దక్కకపోవడానికి కారణం వయోపరిమితే. మోడీ వారసురాలిగా 2014 మే 22న గుజరాత్ తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆనందీబెన్ విధి నిర్వహణలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రిజర్వేషన్లు కల్పించాలంటూ తీవ్ర స్థాయిలో ఎగసిపడిన పటేల్ ఉద్యమం, ఉనాలో దళితులపై దాడి ఘటనతో రగిలిన దళితుల నిరసనోద్యమం ఆనందీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆ ప్రభావంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిని, ప్రతిపక్ష కాంగ్రెస్ పుంజుకోవటం వెనువెంటనే జరిగిపోయింది. మోడీ ప్రధాని పీఠం అలంకరించే నాటికి బలంగా ఉన్న కమలం..తాజాగా వాడిపోయే దశకు చేరుకుంది. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న బీజేపీ అధినాయకత్వం...ఇక ఉపేక్షిస్తే లాభం లేదని..సీఎంగా ఆనందీని కొనసాగిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని భావించారు. అందుకే ఆమెను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవే ఆమె రాజీనామాకు అసలు కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు ప్రస్తుత తమిళనాడు గవర్నర్, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో..అనివార్య పరిస్థితుల్లో రోశయ్య సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిని తీసుకున్న నాటి నుంచి ఆయనకు "దినదినగండం నూరేళ్ల ఆయుష్షు" అన్నట్లుగా నడిచింది. పదవిలోకి వచ్చిరాగానే కర్నూలు, విజయవాడల్లో వరదలు, ఆపై జగన్ వేరు కుంపటి ఇవి చాలవన్నట్లు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో కేసీఆర్ దీక్షలు రోశయ్యకు కంటిమీద కనుకు లేకుండా చేశాయి. తన అనుభవంతో , శక్తిమేరకు సమస్యలను పరిష్కరించాలని చూసినప్పటికి కుదరలేదు. దీంతో రోశయ్య సీఎం పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

 

వయస్సు వల్ల పని ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్టు, తన రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన మీడియాకు తెలిపారు. అయితే వాస్తవంలో రోశయ్య పనితీరుపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తిగా ఉంది..జగన్‌ను కట్టడి చేయలేకపోవడం, ప్రత్యేక, సమైక్య ఉద్యమాల్లో కఠినంగా వ్యవహరించకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీపై అసహనం కలిగేలా చేశాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే సూచనలు కనిపిస్తుండటంతో అధినాయకత్వం రోశయ్యపై ఒత్తిడి పెంచింది. ఇక రోశయ్యకు రాజీనామా చేయక తప్పలేదు. దానికి కారణంగా వయోభారాన్ని చూపారు. ఆనందీ, రోశయ్య ఇద్దరూ తమ తమ పార్టీల కోసం దశాబ్దాల పాటు సేవలు చేశారు, ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. అలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతారా..? తప్పుకోవాలని అనుకుంటారా..? దాని వెనుక కారణం ఎంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.