వైవాహిక బంధంలో సర్దుబాటు తత్వం.. భార్యకు మాత్రమే అవసరమా.!

Publish Date:Sep 7, 2026

Advertisement

వైవాహిక బంధం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి సాగించే ఒక అందమైన ప్రయాణం. ఇందులో సుఖదుఃఖాలు, గెలుపోటములు, సంతోషాలు మాత్రమే కాదు, సర్దుబాట్లు కూడా ఉంటాయి. అయితే.. సమాజంలో ఏళ్ల  తరబడి నడుస్తున్న ఒక ఆనవాయితీ లేదా సంప్రదాయం  ఏమిటంటే, పెళ్లి తర్వాత సర్దుకుపోవడం, త్యాగాలు చేయడం అనేది కేవలం భార్య బాధ్యత మాత్రమే అని. కాలం ఇంత మారినా,  మహిళలు ఆర్థికంగా కూడా ఎంత ఎదిగినా..  ఇప్పటికీ అత్తింట్లో కానీ,  భర్త నుండి కానీ ఇబ్బంది,  కష్టం,  బాధ ఎదురైతే..  అమ్మాయిలకు సర్థుకుపొమ్మని చెబుతూ ఉంటారు కానీ అమ్మాయిల ఆలోచన మారుతోంది.  మగాడు చేసే తప్పులకు,  అత్తింట్లో అత్తమామలు చేసే తప్పులకు,  బాధితులుగా తాము ఎందుకు ఉండిపోవాలని ప్రశ్నిస్తున్నారు.  ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగితే... అన్నింటికి బాధితులుగా అమ్మాయిలు ఉండిపోవాల్సిందేనా?   సర్థుబాటు తత్వం కేవలం భార్యలకేనా?  భర్తలకు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

మహిళల స్థానం..

కుటుంబ వ్యవస్థలో పూర్వం నుంచి స్త్రీ స్థానాన్ని ఇల్లు వదిలి కొత్త ఇంటికి వచ్చే వ్యక్తిగా చూశారు. ఒక కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త అలవాట్లకు అలవాటు పడే క్రమంలో ఆమె సర్దుకుపోవాల్సి రావడం సహజంగా మారింది. కానీ, కాలక్రమేణా సర్దుబాటు అనేది కేవలం ఒకరి వైపు నుంచే జరిగే బాధ్యతగా మారిపోయింది. కుటుంబంలో శాంతి ఉండాలన్నా, బంధం నిలవాలన్నా భార్య మాత్రమే తన ఇష్టాలను, అభిప్రాయాలను, చివరికి తన ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి నడుచుకోవాలనే విధంగా వ్యవస్థ ఏర్పడింది.

సర్దుబాటుతత్వం..

నిజమైన వైవాహిక జీవితం అనేది ఒకరి ఆధిపత్యం, మరొకరి లొంగుబాటు మీద ఆధారపడి ఉండదు. పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అయినప్పుడు, ఆ బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరి పైనా సమానంగా ఉంటుంది. భార్య మాత్రమే సర్దుకుపోవాలి అని అనుకోవడం బంధానికి పునాది కాదు. ఒకవైపు నుంచి మాత్రమే సర్దుబాట్లు జరుగుతుంటే, కాలక్రమేణా ఆ వ్యక్తిలో నైరాశ్యం, కోపం, అసంతృప్తి పేరుకుపోతాయి. అది బంధాన్ని దృఢంగా ఉంచడానికి బదులు, లోలోపల బలహీనపరుస్తుంది.

భర్త వైపు నుంచి కూడా సర్దుబాటు తత్వం చాలా అవసరం. భార్య భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఆమె ఆలోచనలకు విలువ ఇవ్వడం, కొత్త కుటుంబంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో తోడుగా నిలవడం వంటివి భర్త వైపు నుంచి రావాల్సిన ముఖ్యమైన సర్దుబాట్లు. మారుతున్న కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటప్పుడు ఇంటి పనులు, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల్లో ఇద్దరూ సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగాలి.

అసలైన సర్థుబాటు ఇదే..

ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి బలహీనతలను మరొకరు భరించడం, సమస్యలు వచ్చినప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం అసలైన సర్దుబాటు. ఇది ఏ ఒక్కరికో పరిమితమైన సూత్రం కాదు. ఒకరికొకరు తోడుగా ఉండటానికి, కలిసి బ్రతకడానికి చేసుకునే అనుకూలతే నిజమైన సర్దుబాటు తత్వం.

వైవాహిక బంధంలో సర్దుబాటు తత్వం అనేది భార్యకు మాత్రమే అవసరమైన విషయం అనుకోవడం చాలా తప్పు. బంధంలో ప్రేమ, గౌరవం, శాంతి నిలవాలంటే ఇద్దరూ సమానంగా అడుగులు వేయాలి. ఒకరి ఒత్తిడికి మరొకరు లొంగిపోవడం సర్దుబాటు అనిపించుకోదు. ఇద్దరూ పరస్పర అవగాహనతో, ప్రేమతో ఒకరి కోసం మరొకరు మారడానికి సిద్ధపడినప్పుడే ఆ వైవాహిక జీవితం సార్థకమవుతుంది.

తల్లుల పాత్ర..

నిజానికి సర్థుబాటు తత్వం అనేది  మహిళలకు మాత్రమే అవసరం అని అనుకునేముందు ప్రతి తల్లి తమ పిల్లలకు పెళ్ళి చేసే ముందు అమ్మాయికి అయినా,  అబ్బాయికి అయినా సర్థుబాటు తత్వం ఎందుకు ముఖ్యం, ఎలాంటి పరిస్థితిలో ఎవరు సర్థుబాటు చేసుకోవాలి అని  తెలియజెప్పాలి. అత్తా ఒక ఇంటి కోడలే.. తల్లి ఒక ఇంటికి కోడలే.. పెద్దలు తాము ఎదుర్కొన్న పరిస్థితులు కనీసం రేపటి తరం అయినా ఎదుర్కోకుండా ఉండాలని ఆశించాలి.  కొడుకుకు అయినా,  కూతురుకు అయినా వివాహం తర్వాత సర్దుకుపోవడాన్ని గురించి వివరిస్తే..  వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవల తాలూకు వచ్చే దూరాలు,  విడిపోవడాలు చాలా వరకు తగ్గుతాయి.  వారి జీవితం నూరేళ్ల పాటు సంతోషంగా సాగుతుంది.

                                       *రూపశ్రీ.

 

By
en-us Political News

  
దీపావళి పండుగ సమయంలో మధుమేహం ఉన్నవారు స్వీట్లు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ ఫ్రీ మరియు బెల్లం స్వీట్లు సురక్షితమేనా? రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ముఖ్యమైన ఆరోగ్య చిట్కాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
విటమిన్ B12 లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, అలసట, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయా? ఈ పోషక లోపం లక్షణాలు, కారణాలు మరియు తీసుకోవాల్సిన ఆహారాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే 5 సులువైన ఇంటి చిట్కాలు మరియు జాగ్రత్తల పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఉదయం పూట ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, బరువు తగ్గడానికి దీన్ని ఎలా త్రాగాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
బాదం, పిస్తా కంటే తక్కువ ధరలో లభించే వేరుశనగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. చలికాలంలో రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బరువు నియంత్రణ మరియు పోషక వివరాల పూర్తి సమాచారం.
చెవి నొప్పి మరియు గ్రేడ్ 2 టింపానిక్ మెంబ్రేన్ రిట్రాక్షన్ సమస్యతో బాధపడుతున్నారా? ఆయుర్వేద నిపుణుల సలహాలు, షడ్బిందు తైలం నస్య కర్మ, గృహ చికిత్సలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం తెలుసుకోండి.
ఉడికించిన గుడ్లు వర్సెస్ ఫ్రైడ్ ఎగ్స్.. ఏ పద్ధతిలో వండుకుంటే శరీరానికి ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది? బరువు తగ్గడానికి ఏది మంచిది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యూరప్‌లో ఒక చిన్నారి నేర్పిన జీవిత పాఠం! గెలుపుతో పాటు ఓటమిని, వద్దు అనే తిరస్కారాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిపే అద్భుతమైన స్ఫూర్తిదాయక వెబ్ స్టోరీ కథనం.
మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.