ఇండియాకు వరం.. టారిఫ్ రీఫండ్

Publish Date:Apr 22, 2026

Advertisement

అమెరికా ప్రభుత్వం గతంలో విధించిన కఠినమైన వాణిజ్య  టారిఫ్ లను అక్కడి న్యాయస్థానం రద్దు చేయడంతో..  భారత ఎగుమతిదారులకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశంఉంది.  ట్రంప్   అమల్లోకి వచ్చిన పలు సుంకాలపై కోర్టు స్టే విధించడమే కాకుండా..  వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20 నుంచి రీఫండ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.  దీనివల్ల భారతదేశానికి సుమారు 12 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1 లక్ష కోట్లు    లబ్ధి చేకూరుతుందన్నది అంచనా.  

ఈ రీఫండ్ ప్రక్రియలో ప్రధానంగా మూడు రంగాలు అత్యధికంగా లాభపడనున్నాయి. అమెరికా మార్కెట్‌కు పెద్ద ఎత్తున వస్తువులను సరఫరా చేసే భారతీయ వస్త్ర  పరిశ్రమకు సుమారు 4 బిలియన్ డాలర్లు వాపసు వచ్చే అవకాశం ఉంది. అలాగే..  ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు మరో 4 బిలియన్ డాలర్లు, రసాయన  ఉత్పత్తుల రంగానికి 2 బిలియన్ డాలర్ల మేర రీఫండ్లు అందవచ్చనని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇతర చిన్న తరహా ఎగుమతి రంగాలు కూడా ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య అజెండాలో భాగంగా  అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అనేక దేశాలపై అదనపు సుంకాలను విధించారు. అయితే..  ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేలాది కంపెనీలు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఫిబ్రవరిలో హైకోర్టు ఈ సుంకాలు  రాజ్యాంగ విరుద్ధమని తేల్చడంతో..  సుమారు 127 బిలియన్ డాలర్ల మొత్తం రీఫండ్‌కు అర్హత పొందింది. ఈ చారిత్రాత్మక తీర్పు ట్రంప్ ఆర్థిక విధానాలకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. 

రీఫండ్ ప్రక్రియ ఇలా సాగుతుందియూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్  ఇప్పటికే ఈ చెల్లింపుల కోసం ఆన్‌లైన్ ప్రాసెసింగ్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మార్చి నాటి అంచనాల ప్రకారం..  దాదాపు 3.3 లక్షల మంది దిగుమతిదారులు ఈ రీఫండ్ల కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. ఇప్పటి వరకూ  56 వేల మందికి పైగా   తమ క్లెయిమ్‌లను నమోదు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించిన తర్వాత, అధికారులు వాటిని పరిశీలించి 60 నుంచి 90 రోజుల వ్యవధిలో నగదును విడుదల చేస్తారు.
 అయితే.. ఇక్కడ గమనించాల్సిన   విషయం ఏంటంటే..  ఈ రీఫండ్లు నేరుగా అమెరికాలోని దిగుమతిదారులకు  అందుతాయి. భారతీయ ఎగుమతిదారులు ఈ నిధులను పొందాలంటే తమ అమెరికన్ భాగస్వాములతో చర్చలు జరపాల్సి ఉంటుంది. దీనికోసం నిపుణులు మూడు రకాల మార్గాలను సూచిస్తున్నారు. 

వాటిలో మొదటిది.. రీఫండ్ రూపంలో వచ్చే మొత్తాన్ని ఇరు పక్షాలు పంచుకునేలా కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం. రెండోది..  గతంలో పన్నుల భారం వల్ల పెరిగిన ధరలను, ఇప్పుడు ఆ భారం తగ్గింది కనుక  సవరించడం ద్వారా ప్రయోజనం పొందడం. ఇక మూడోది..  రీఫండ్ మొత్తాన్ని క్రెడిట్‌గా మార్చుకుని..  రాబోయే ఆర్డర్లపై రాయితీలు పొందడం. భవిష్యత్ పరిణామాలు అమెరికా నుంచి రానున్న ఈ భారీ నగదు ప్రవాహం భారతీయ కార్మిక-కేంద్రీకృత రంగాలకు ఊపిరిపోస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా టెక్స్‌టైల్ వంటి రంగాలలో లాభాల శాతం పెరగడమే కాకుండా..  అంతర్జాతీయ మార్కెట్‌లో భారత వస్తువుల ప్రాధాన్యత పెరుగుతుంది.   ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ రంగాలపై విధించిన ప్రత్యేక సుంకాలు ఇంకా కొనసాగుతుండటంతో..  ఆయా రంగాల ఎగుమతిదారులు మాత్రం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. రాబోయే కొద్ది నెలల్లో భారతీయ సంస్థలు ఎంత చాకచక్యంగా తమ అమెరికన్ భాగస్వాములతో వ్యవహరిస్తాయనే దానిపైనే ఈ టారిఫ్ రిఫండ్ లబ్ధి  ఆధారపడి ఉంటుంది.

- సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
ఇరాన్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చేవరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని పేర్కొన్న ట్రంప్.. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ పౌరులకు అసౌకర్యాన్ని తగ్గించే ఉద్దేశంతో మెట్రో రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు.
విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను ఘోష్ కమిషన్ పాటించలేదని ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం విషమించి.. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
గత కొన్ని దశాబ్దాలుగా కెనడా విదేశీయులకు స్వర్గధామంగా నిలిచింది. అయితే, ఇటీవల కాలంలో పెరుగుతున్న జనాభా, గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడి దృష్ట్యా కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేస్తోంది. తాజాగా తీసుకువచ్చిన బిల్ ప్రధానంగా కెనడా పౌరసత్వం పొందే ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు.. అనర్హులను ఏరివేసేందుకు ఉద్దేశించినదని చెబుతున్నారు.
ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల సమయంలో అమెరికా స్థావరాల కంటే యూఏఈ సొంత రక్షణ వ్యవస్థలే సమర్థవంతంగా పనిచేయడం విశేషం. దీంతో అల్ ధఫ్రా వంటి భారీ అమెరికా సైనిక స్థావరాలు దేశానికి ఆస్తిగా కాకుండా.. శత్రువుల దాడులను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్న అభిప్రాయం వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది.
యూఏఈ తన భద్రత, ఆర్థిక, కరెన్సీ వ్యూహాలను పునఃపరిశీలిస్తోంది. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల నిజంగా ప్రయోజనం ఉందా? లేక ఇది దేశానికి అదనపు ప్రమాదాన్ని తెస్తుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని డిపోల ముందు డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో చేరి నిరసలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్ లు, బస్ స్టేషన్లు బోసిపోయాయి. ఇక హైదరాబాద్ లో అయితే సిటీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనాథల రాతను మారుస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ సంధించిన అక్షరాయుధం నెల్లూరులో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. మున్సిపల్ స్కూల్స్ భవనాలు చూసి ముగ్ధులై, భిక్షా పాత్రలను విసిరికొట్టి పుస్తకాలు పట్టిన ఆ చిన్నారుల పట్టుదల, నేడు వారిని సమాజం గర్వపడే హీరోలుగా నిలబెట్టింది.
వీరు ఒక వ్యక్తిగత కుటుంబ వివాదాన్ని ఆధారంగా చేసుకుని బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి సి ఐ ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారనీ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పరుగుల వరద పారించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోశాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్37 పరుగులు, ఇషాన్ కిషన్ పాతిక పరుగులు చేశారు. చివరిలో హెన్రిచ్ క్లాసెన్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించి 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.