జీవితంలో ఏడు వింతలు...!

Publish Date:Apr 24, 2017

Advertisement

 

ఆ అమ్మాయి పేరు సరిత. తను ఉండే చిన్న పల్లెటూరిలో ఆరో తరగతి వరకే చదువుకునే అవకాశం ఉంది. అందుకే మిగతా చదువు కోసం పక్కనే ఉన్న పట్నానికి బయల్దేరింది. పట్నం బడిలో అడుగుపెట్టిన ఆ పల్లెటూరి పిల్లని చూడగానే అందరూ ఒక్కసారిగా ఫక్కున నవ్వారు. దూరం దూరం జరిగారు. కొత్త వాతావరణం, భయపెట్టే వాతావరణం... అందుకనే సరిత తల ఎత్తి కూడా చూడకుండా నేరుగా తరగతిలోకి వెళ్లి కూర్చుండిపోయింది.

 


బెల్లు కొట్టిన ఓ రెండు నిమిషాలకి తరగతిలోకి టీచర్‌ ప్రవేశించారు. సరిత వాలకం చూసి ఆమె కూడా నొసలు చిట్లించారు. ఆపై క్లాసులో పిల్లలందరినీ చూస్తూ- ‘ఇప్పటివరకూ మీకు ఏమాత్రం చదువు అబ్బిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకనే ఓ కాగితం తీసుకుని దాని మీద ఈ ప్రపంచంలోని ఏడు వింతలు ఏమిటో రాసి చూపించండి,’ అంటూ హుకుం జారీ చేసింది.

 


టీచరుగారు చెప్పడమే ఆలస్యం... క్లాసులో పిల్లలంతా హడావుడిగా తలో కాగితం చింపి దాని మీద ప్రపంచంలోని ఏడు వింతలనీ రాయడం మొదలుపెట్టారు. ఓ పది నిమిషాలు గడిచేసరికి అందరూ తమకు తెలిసిన ఏడు వింతల్నీ రాయడం పూర్తిచేసేశారు. కానీ సరిత మాత్రం ఇంకా రాస్తూనే ఉంది. ‘అదేంటీ! నువ్వు ఇన్నాళ్లూ చదువుకున్న బడిలో ఈ మాత్రం కూడా చెప్పలేదా!’ అంటూ చిరాగ్గా అడిగింది టీచర్.
‘చెప్పారు టీచర్‌. కానీ నాకు తోచిన సమాధానం రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఆలోచనలతో కాస్త ఆలస్యం అయ్యింది,’ అని సంజాయిషీ చెబుతూ తన కాగితాన్ని టీచరుగారి చేతిలో పెట్టింది సరిత.

 


టీచర్ నిదానంగా ఒకొక్కరి జవాబులనీ చదువుతూ కూర్చుంది. విద్యార్థులంతా తాము సరైన జవాబులు రాశామో లేదో అని మిగతావారితో గుసగుసలాడుకోసాగారు. వాళ్లలో చాలామంది ఏడు వింతలు అనగానే తాజ్‌మహల్‌, పిరమిడ్స్‌, గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా... లాంటి కట్టడాల గురించి రాశారు.

 

టీచర్‌ ఒకో కాగితం చూసుకుంటూ సరిత రాసిన జవాబు పత్రాన్ని చేతిలోకి తీసుకుంది. అందులో ఉన్నది చదవగానే నమ్మలేకపోతున్నట్లుగా కళ్లు చికిలించి మరీ చూసింది. ఆపై సరిత వంకా చూసింది. సరిత మొహంలో ఆమెకు ఏ భావమూ ప్రస్ఫుటం కాలేదు... ఒక్క అమాయకత్వం తప్ప!


ఏడు వింతలనగానే సరిత తన జవాబులుగా ఈ వింతలను పేర్కొంది- ‘చూడగలగడం, వినగలగడం, అనుభూతి చెందగలగడం, నవ్వగలగడం, ఆలోచించగలగడం, ఆలోచనలని వ్యక్తం చేయగలగడం, కరుణతో మెలగడం’. ఆ జవాబులని చదివిన టీచర్ కళ్లు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. ఒక పేద పల్లెటూరి పిల్ల జీవితంలోని నిజమైన ఏడు వింతలలూ ఏమిటో తెలుసుకోగలిగింది కదా! అనుకుంది. తన విద్యార్థులందరికీ ఆ ఏడు వింతల విలువా తెలియచేసినప్పుడే వారి చదువుకి అర్థం అనుకుంది. అందుకే సరిత జవాబులని బిగ్గరగా చదివి వినిపించింది. ఆ జవాబులని విన్న విద్యార్థులంతా ఒక్క క్షణం అబ్బురంగా సరిత వైపు చూశారు. వారి కళ్లలో ఇప్పుడు సరిత పట్ల చులకన లేదు. అలాంటి మనిషి తమ తరగతిలో ఉందన్న సంతోషం కనిపించింది.
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.

 

By
en-us Political News

  
అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచికరమైన పెసరపప్పు హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
గ్రీన్ మటన్ కర్రీని పచ్చి మసాలాలు, పచ్చిమిర్చి మరియు కొబ్బరి పేస్ట్ తో అత్యంత రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
దీపావళిలో టపాసులు పేలేటప్పుడు కంటికి గాయాలైతే తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్స గురించి తెలుసుకోండి.
బేరి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ మరియు మధుమేహం అదుపులో పియర్ ఫ్రూట్ ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు.
అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసి తింటున్నారా? రీహీటెడ్ రైస్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం మరియు పాటించాల్సిన 24 గంటల రూల్ గురించిన పూర్తి వివరాలు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ వంట నూనెలు ఉత్తమమైనవి? కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి నూనెలను ఏ విధంగా వాడాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్ క్రీమ్స్‌కు బదులుగా 800 ఏళ్ల నాటి ఆయుర్వేద నిపుణులు సూచించిన జాజికాయ, ములేఠీ పేస్ట్ చిట్కాతో సహజంగా మెరిసే కళ్లను సొంతం చేసుకోండి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, డయాబెటిస్ ముప్పును నివారించడానికి కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్న 4 హానికరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి.
మినుములు లేదా మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో తెలుసా? ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే మినుములు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, ఎముకలను బలంగా మార్చి, కీళ్ల నొప్పులు మరియు ఉబ్బసానికి ఎలా చెక్ పెడతాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
నడుము నొప్పితో బాధపడుతున్నారా? వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మరియు నడుము నొప్పిని తగ్గించడానికి పాటించవలసిన 5 అత్యవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు కాదంటూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు సంచలన విషయాలు వెల్లడించాయి. సగటు ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి బాణసంచా పొగ వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి. N95 మాస్క్ వినియోగం, AQI తనిఖీ మరియు తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్.
ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.