తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ....భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Publish Date:May 21, 2026

Advertisement

 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో వేసవి రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే శ్రీ‌వారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమ లకు తరలివస్తుండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, అన్నప్రసాదాలు, వైద్య సేవలు, నీడ సదుపాయా లను కల్పిస్తూ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోంది.

వేసవి ఎండ తీవ్రత నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు బాట గంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో అదనపు షెల్టర్లు నిర్మించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు చేపట్టడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శ్రీ‌వారి సేవకుల ద్వారా నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. 

ఉదయం పాలు ఉప్మా, పొంగల్‌, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమోటా రైస్‌, రాత్రి సాంబారన్నం వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. అలాగే మొబైల్ వాటర్ డ్రమ్ముల ద్వారా కూడా తాగునీటి సరఫరా కొనసాగుతోంది. రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డులో మొబైల్ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు తలనీలాల సమర్పణ కోసం ప్రధాన కళ్యాణకట్టతో పాటు 11 మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచి భక్తులకు నిరంతరాయ సేవలు అందిస్తున్నారు.

టీటీడీ వివరాల ప్రకారం గత ఐదు రోజుల్లోనే 4 లక్షల 32 వేల మందికిపైగా భక్తులు శ్రీ‌వారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో రోజుకు 90 వేల మందికిపైగా దర్శనం చేసుకోగా, మే 18 నుంచి 20 వరకు రోజుకు 43 వేలకుపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదే కాలంలో దాదాపు 19 లక్షల మందికి అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

తిరుమలలో ప్రస్తుతం సుమారు 7500 గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో గదుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పీఏసీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన లాకర్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అయినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది క్యూలైన్లు, షెడ్లు, కంపార్టుమెంట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ సేవలందిస్తున్నారు.
 

By
en-us Political News

  
అమెరికా డాలర్ రోజురోజుకూ బలోపేతం కావడం... యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు ఊహించని విధంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి నుంచి తమ లాభాల స్వీకరణకు, అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
ప్రత్యేక బిహేవియర్ కోడ్ ఆఫ్ కండక్ట్.. అంటే పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించేలా ఒక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే కుటుంబాలు, ముఖ్యంగా మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, మహిళా పర్యాటకులు ఎక్కడా అసౌకర్యానికి, వేధింపులకు గురికాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఇంధన ధరల పెంపు తొలి సారి మే 15 న, ఆ తర్వాత వెంటనే మే 19 న రెండోసారి కూడా చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పుడు శనివారం జరిగిన తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 5 రూపాయల మేర పెరిగాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 , అభిషేక్ శర్మ 22 బంతుల్లో 56 , హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులతో చెలరేగారు. చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి కూడా12 బంతుల్లో 29 నాటౌట్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది.
రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
సరికొత్త బైక్ కొనడం చాలా మందికి ఒక కల. అయితే ఆ కల కోసం ముప్పై ఏళ్లుగా నిరీక్షించి, వినూత్న రీతిలో దాన్ని సాకారం చేసుకున్నారు
చంద్ర‌బాబును చేర‌దీసింది రాజారెడ్డే అంటారు. వాళ్లు వాళ్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లే క‌దా? అలాంటి చంద్ర‌బాబు రాజారెడ్డిని హ‌త్య చేయించి ఉంటారా?
ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణ సచివాలయం వద్ద ఉధృత వాతావరణం నెలకొని ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.