సంపాదనా స్వరం ఏమి చెబుతోంది??

Publish Date:Oct 26, 2024

Advertisement

జీవితంలో రూపాయి కూడా ఎంతో విలువైనదే.ఆ రూపాయి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే చేతులు, జేబులు ఖాళీగా ఉన్నపుడు. కానీ ఇప్పటి తరానికి ఆ రూపాయి విలువ పెద్దగా తెలియదు. ఏ కొందరికో తప్ప రూపాయి విశ్వరూపం కూడా తెలీదు.

విశ్వరూపం అంటే పుట్టుక పూర్వోత్తరాలు కాదు. కొందరి దృష్టిలో రూపాయి అంటే పెద్దగా లెక్కలేనిది. కారణం ఏమిటని చూస్తే ఇప్పటి కాలంలో డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు వచ్చి పడ్డాయి.  ఆ మార్గాల ద్వారా డబ్బు సంపాదన ఎంతో సులభం. కొన్ని దారులు సులభ పద్దతిలో నిజాయితీగా  ఉన్నా ఎక్కువ భాగం వక్రమార్గంలో సంపాదిస్తుండటమే నేటి యువత పెడదారిలో వెళ్ళడానికి కూడా కారణం.

ఈజీ మని లేజీ యూత్

ఎందుకు కష్టపడాలి సులువైన మార్గాలు ఉండగా. హాయిగా మొబైల్ చేతిలో ఉంటేనో, లాప్టాప్ లేదా సిస్టం దగ్గర ఉంటేనో కాలు కదపకుండా, కండ కరగకుండా హాయిగా సంపాదించేయచ్చు. అది తప్పు దారి అని ఎవరైనా అంటే ప్రపంచంలో ఎన్నో తప్పులు జరుగుతుంటే మేము చేసేది తప్పు ఎలా అవుతుందనే సమర్థింపు కూడా చాలామందిలో కనబడుతుంది. 

చూడటానికి జులయిగానూ, పని పాట లేక ఉండేవాళ్ళు చాలామంది ఇలాంటి ఈసీ మనికి జై కొడుతూ ఉంటారు. అయితే వీళ్ళలో సగం వరకు యువత సరైన ఉద్యోగ అవకాశాలు లేవనే ఆలోచనతో కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. పలితంగా ఒక సరైన దిశ లేక సాగుతుంది వీరి జీవితం. ఇలా ఈసీ మనీ సంపాదన తాత్కాలిక పరిష్కారమే తప్ప జీవితంలో సంపాదన అనే విషయంలో ఒక దీర్ఘకాలిక మార్గాన్ని చూపించదు అది. కానీ యువతకు ఇది అర్థం కాదు. తప్పేం కాదనే వాధన ఒకవైపు అయితే, ప్రస్తుతం హాయిగా గడిచిపోతోందనే మూర్ఖపు ఆలోచన మరొకవైపు. ఫ్యూచర్ గురించి ఒకప్పటి తరం ఆలోచించినట్టు ఇప్పుడు ఆలోచించడం లేదనేది ఒప్పుకోవలసిన వాస్తవం. ఫలితంగా కలుగుతున్నదే భారతదేశంలో నిరుద్యోగ వ్యవస్థ.

చాలా చోట్ల ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ ఇంకా పలువిధాలైన కారణాలు చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటల్లో సమర్థింపే ఎక్కువ.  కష్టపడి తత్వం గురించి అర్థం చేసుకుంటే దాని ద్వారా వచ్చే సంపాదన రుచి తెలిస్తే భారతదేశంలో యువత ఎంతో మెరుగవుతుంది.

లాటరీలు, క్రికెట్ బెట్టింగ్ లు, అకౌంట్స్ హాక్ చేసి అకౌంట్స్ లో డబ్బులు కాజేయడం, స్మగ్లింగ్ వంటి పనులలో పాల్గొనడం. దొంగతనాలు, బ్లాక్మైల్ చేసి డబ్బు గుంజడాలు. ఇలాంటివన్నీ చేస్తున్నది యువతే అంటే ఆశ్చర్యం వేస్తుంది అలాగే భారతదేశ యువత ఏ పరిస్థితిలోకి దిగజారిపోతోందో అని విచారం కలుగుతుంది. 

పైగా ఇలాంటి పనులన్నీ చేయడం అవి బయటపడతాయేమో అని నేరాలు చేయడం, బెదిరించడం వంటివి  ఇంకా ఉబిలోకి నెడుతూ జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎలా సంపాదిస్తున్నాం, అందులో నిజాయితీ ఎంత అనే విషయాలపైన ఆ వ్యక్తి జీవితం ఎంత బాగుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది.  దీనిగురించి జాగ్రత్తలు తీసుకోవలసింది ఖచ్చితంగా పెద్దలే. ఎందుకంటే పిల్లల అవసరాలు ఏమిటి?? వాళ్ళు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్లకు డబ్బు ఎక్కడినుండి వస్తోంది, వాళ్లెం చేస్తున్నారు వంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అంతేతప్ప పిల్లలు అవసరాల కోసం డబ్బు అడగడం లేదు మిగిలిపోతోందిలే అనుకుంటే వాళ్ళ జీవితంలో అన్ని కోల్పోయి ఏమి మిగలకుండా తయారవుతారు.

అందుకే సంపాదించే ప్రతి రూపాయి ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. అది కష్టం విలువో, అవినీతి తాలూకూ గుణపాఠమో, చివరి పలితమో.  అనుభవించాల్సింది దాన్ని సంపాదించే వాళ్లే కాబట్టి ఆ సంపాదనా స్వరాన్ని కాస్త వింటూ ఉండండి.

◆ వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సమాజంలో లేదా పని చేసే చోట కొందరు వ్యక్తులు మన ఎదుగుదలను చూసి ఓర్వలేక శత్రువులుగా మారుతుంటారు.
పండుగ వేళల్లో ఇష్టమైన వంటకాలు ఎక్కువగా లాగించడం వల్ల తీవ్రమైన ఎసిడిటీ మరియు ఛాతీలో మంట వస్తుందా? ఎసిడిటీకి కారణమయ్యే ఆహార పొరపాట్లు మరియు వాటిని నివారించే సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
స్మార్ట్‌వాచ్‌లో గుండె వేగం సాధారణంగా ఉన్నప్పటికీ పక్షవాతం (Stroke) వచ్చే అవకాశం ఉందా? వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు, స్ట్రోక్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు తెలుసుకోండి.
టీ మరియు కాఫీలలో ఆరోగ్యానికి ఏది మంచిది? రీసెంట్ స్టడీ రిపోర్ట్ ప్రకారం టీ, కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు మరియు ఎముకల ఆరోగ్యంపై పడే ప్రభావం పూర్తి వివరాలు తెలుసుకోండి.
క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ప్రోటీన్లు కంతులను సులువుగా గుర్తించేలా చేసినప్పటికీ, రోగనిరోధక దాడి నుంచి ఎలా తప్పించుకుంటున్నాయో తెలిపే తాజా వైద్య పరిశోధనా విశేషాలు.
చలిగాలులు వీచినప్పుడు కళ్ల నుంచి నీరు ఎందుకు కారుతుంది? ఇది డ్రై ఐ సమస్య లేదా అలర్జీనా అనే పూర్తి వివరాలు, కారణాలు మరియు నివారణ మార్గాలను తెలుసుకోండి.
పిల్లలతో అనుబంధం అనేది కేవలం రక్త సంబంధానికి మాత్రమే పరిమితం కాదు. అది పరస్పర నమ్మకం, భావోద్వేగాల కలయికపై ఆధారపడి ఉంటుంది.
ఉదయం నిద్రలేవగానే పరగడుపున నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, జీర్ణక్రియ మెరుగుపడటం, హైడ్రేషన్ మరియు కిడ్నీల ఆరోగ్యంపై నిపుణుల సలహాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
మధుమేహాన్ని సహజంగా నియంత్రించే అద్భుతమైన దేశీయౌషధం కానుగ పువ్వు పొడి గురించిన పూర్తి వివరాలు. టైప్ 1, టైప్ 2 షుగర్ లెవల్స్‌ను తగ్గించే ఈ ఇంటి చిట్కా ప్రయోజనాలు, తయారుచేసే విధానం తెలుసుకోండి.
బెండకాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? షుగర్, కొలెస్ట్రాల్, జీర్ణశక్తిపై డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు మరియు తయారుచేసే సరైన విధానం ఇక్కడ తెలుసుకోండి.
శరీరంపై కొవ్వు గడ్డలు లేదా లిపోమా సమస్యతో బాధపడుతున్నారా? సర్జరీ లేకుండా సహజమైన ఇంటి చిట్కాలు, ఆహారపు అలవాట్లు మరియు ఆయుర్వేద మార్గాల ద్వారా కొవ్వు గడ్డలను ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.