సంచలనానికి తెర తీయబోతున్న దాసరి

Publish Date:Feb 6, 2012

Advertisement

హైదరాబాద్: సొంతపార్టీలోని ప్రత్యర్థులను టార్గెట్ చేయడం ద్వారా దర్శకరత్న దాసరి  నారాయణ రావు సంచలనానికి తెరదీయబోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై  దాసరి మరో సినిమా అస్త్రాన్ని ప్రయోగించనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రతిపక్షాలపై వ్యంగ్య చిత్రాలు తీసిన దాసరి ఈసారి మాత్రం సొంత పార్టీ నేతల పైనే తీయనున్నారని తెలుస్తోంది. ఆయన అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో నమోదు చేసినట్లుగా సమాచారం. త్వరలో తన పదవి ముగుస్తుండటం, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం, చిరుకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తుండటం వంటి ఇలాంటి సమయంలో దాసరి అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్ నమోదు చేయించారనే వార్త చర్చకు దారి తీసింది. గత సాధారణ ఎన్నికలకు ముందు ఆయన మేస్త్రీ అనే చిత్రాన్ని తీశారు. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవిని లక్ష్యంగా చేసుకొనే ఆయన ఈ సినిమా తీసినట్టు ప్రచారం జరిగింది. రాజకీయ ప్రత్యర్థులపై సినిమా ద్వారా వ్యంగ్యాస్త్రాలు ఎక్కు పెట్టడంలో దాసరికి ఎవరూ సాటి లేరనే చెప్పవచ్చు. ఆయన తాజాగా తలపెట్టిన చిత్రం 2014 ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు.  స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో దాసరి తన ఉదయం పత్రిక ద్వారా ఆయనను టార్గెట్ చేశారు. అయితే అప్పుడు కాంగ్రెసులో ఉండటంతో టిడిపి, ఆ తర్వాత మేస్త్రీ ద్వారా చిరంజీవిని టార్గెట్ చేశారు. మారిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసుకోవడం విశేషం.

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.