సాగర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై కారు దగ్దం
Publish Date:Mar 2, 2026
Advertisement
అతి వేగంగా వెడుతున్న కారు లారీని ఢీకొని దగ్ధమైన సంఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ సాగర్ రింగురోడ్డు బ్రిడ్జిపై సోమవారం (మార్చి 1) తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అతివేగంగా దూసుకెళ్తున్న ఓ కారు అదుపు తప్పి ముందుగా లారీని, అనంతరం డివైడర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వారు అప్రమత్తమై వెంటనే కారు నుంచి బయటకు రావడంతో ప్రాణనష్టం జరగలేదు. అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం చుట్టుముట్టాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొ న్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తు న్నారు.
http://www.teluguone.com/news/content/fire-errupted-in-car-on-sagar-ring-road-36-214858.html





