కొత్తగా 62 అన్న క్యాంటీన్ల...ఈనెల 15న సీఎం చంద్రబాబు శ్రీకారం

Publish Date:Apr 13, 2026

Advertisement

 

కార్మికులు, కూలీలు, గ్రామీణులు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం... తాజాగా మరికొన్ని అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. రూ.5లకే పేదలకు కడుపునిండా నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పిన సర్కార్... ఆ హామీని ఆచరణలో పెడుతోంది. 

మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయగా 3 క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో  ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రెండవ విడత అన్నక్యాంటీన్లను ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో ప్రారంభిస్తారు

రూ.5లతో రుచిగా... శుచిగా ఆహారం

గత ప్రభుత్వం కక్షగట్టి మూసివేసిన అన్నక్యాంటీన్లను కూటమి అధికారంలోకి వచ్చాక పున: ప్రారంభించింది. ఈనెల 15వ తేదీన ప్రారంభించబోయే 62 క్యాంటీన్లతో ఈ సంఖ్య 269 కు పెరుగనుంది. రుచి, శుచితో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పేదలకు ప్రభుత్వం అందిస్తోంది. క్యాంటీన్ల పున:ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా పేదలు 8.80 కోట్ల భోజనాలు చేశారు. 

ఒక్కో అన్న క్యాంటీన్‌లో సగటున రోజుకు 1,013 మంది చేసే భోజనాలకు  రూ.26,250 ఖర్చు అవుతోంది. 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. ఇందుకు రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతుండగా... సబ్సిడీ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.243 కోట్లు వెచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే గ్రామీణ అన్న కాంటీన్ల సబ్సీడీకి ఏడాదికి రూ.58 కోట్లు వ్యయం అవ్వనుంది.

By
en-us Political News

  
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు.
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది.
మెట్రో సంస్థకు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది.
400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు
రాజేంద్రనగర్ లో విద్యార్థుల ఆందోళన చేస్తూ ఉండడంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది.
ముంబై ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ వర్గాలు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది. తాము చెప్పదలచుకున్న విషయాలను పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది.
ప్రజాదరణపై ఏ స్థాయిలో ఉంటుందో రాఘవ్ చద్దా ఉదంతం మరోసారి నిరూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.