డీలిమిటేషన్‌పై కమిటీ ఏర్పాటు చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Publish Date:Apr 13, 2026

Advertisement

 

సీట్ల పునర్విభజనలో శాతం కాదు, సంఖ్యే ముఖ్యం. రాజకీయాల్లో కూడా నెంబర్లే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి మాట్లాడారు. ఒకప్పుడు వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. నెంబర్లు లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు జరపరు. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను శిక్షించకూడదని సీఎం పేర్కొన్నారు.

1980 ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పడింది. ఇప్పటివరకు 15 మంది అధ్యక్షులు నియమితులయ్యారు. కానీ ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించబడలేదు. దీనివల్ల మహిళల పట్ల బీజేపీకి ఉన్న దృక్పథం అర్థమవుతుంది. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు గౌరవం ఇచ్చింది. మహిళను అధ్యక్షురాలిగా నియమించిన తర్వాతే బండి సంజయ్ మాట్లాడాలని రేవంత్ డిమాండ్ చేశారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళల పట్ల వ్యతిరేకంగా ఉన్నాయి. మా ఎంపీలు తెలంగాణను సాధించారు, ఇప్పుడు పునర్విభజన విషయంలో కూడా పోరాడతారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్లమెంట్‌లో బిల్లు ఎలా ఆమోదిస్తారో చూస్తామని సీఎం తెలిపారు.

60 సంవత్సరాల్లో మహిళల కోసం కాంగ్రెస్ చాలా చేసింది. కానీ 46 సంవత్సరాల్లో బీజేపీ ఒక్క మహిళకు కూడా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం బీజేపీ లక్షణం. స్వాతంత్ర్యం తీసుకురావడం, రాజ్యాంగం ఇవ్వడం, రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు దేశాన్ని కాపాడే బాధ్యత కూడా కాంగ్రెస్‌దే. సీట్ల పునర్విభజనలో యాభై శాతం పెంపు జరిగితే, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ప్రాధాన్యం ఉండదు. అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ వంటి చిన్న రాష్ట్రాలకు ఈ విషయంపై లేఖ రాస్తానని అన్నారు.

కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనను కలిపి చూపిస్తూ ప్రతిపక్షాలపై తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు అంశాలు వేర్వేరు. వీటిని విడదీసి చర్చించాలి.రాజ్యాంగంలోనే మహిళలకు ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్. అప్పట్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్. ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశాలు కల్పించింది.

రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. బీజేపీ సహకరించకపోవడం వల్ల లోక్‌సభలో ఆమోదం కాలేదు.2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అయితే 2026 జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని చట్టం చేయడం ద్వారా ఆలస్యం చేస్తున్నారు. 2024లోనే అమలు చేస్తే 543లో 181 మంది మహిళలు ఎంపీలు అయ్యేవారు.

పునర్విభజనను మహిళా బిల్లుతో కలపడం వెనుక రాజకీయ కుట్ర ఉంది. 2026 జనాభా లెక్కల ఆధారంగా బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.గతంలో నియోజకవర్గాల పునర్విభజన మూడు సార్లు జరిగింది. 1967లో 520 సీట్లు, 1976లో 542 సీట్లు, తరువాత సిక్కిం కలవడంతో 543 అయ్యాయి. ఇందిరా గాంధీ జనాభా ఆధారంగా సీట్ల పెంపును 25 ఏళ్ల పాటు నిలిపివేశారు.

దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించడంతో జనాభా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. ఇప్పుడు అదే ఆధారంగా సీట్ల పెంపు చేస్తే అన్యాయం జరుగుతుంది.యాభై శాతం పెంపుతో ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రయోజనం కలుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఇది దేశ ఐక్యతకు మంచిది కాదు.సీట్ల పునర్విభజనపై నేను హైబ్రిడ్ మోడల్‌ను సూచిస్తున్నాను. 

పెంచే సీట్లలో సగం ప్రోరేటా ప్రాతిపదికన, మిగతా సగం జీఎస్‌డీపీ ఆధారంగా కేటాయించాలి. దేశానికి ఎక్కువ ఆదాయం అందించే రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. నిపుణులతో కమిటీ వేయాలి. అన్ని అసెంబ్లీల్లో చర్చించి, పార్లమెంట్‌లో ఆమోదించాలి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. తొందరపాటు నిర్ణయాలతో ఉత్తరాది-దక్షిణాది మధ్య అంతరాన్ని పెంచకూడదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

By
en-us Political News

  
ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో అమలులోకి వచ్చిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒక ఆశావహ పరిస్థితిని ఆవిష్కరించినప్పటికీ, ఇది కేవలం ఒక చిన్న రాజకీయ అవకాశంగానే కనిపిస్తోంది తప్ప ఉద్రిక్తతలను చల్లార్చే శాశ్వత పరిష్కారంగా ఎంత మాత్రం స్థిరపడే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇరాన్ విషయంలో అమెరికా అంచనాలు తలకిందులవ్వడంతో ట్రంప్ సంయమనం కోల్పోయినట్లు కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగకూడదన్నదే ఆ పార్టీల అసలు ఉద్దేశమని ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయ స్వార్థం కోసం మహిళా హక్కులను కబళించడం క్షమించరాని పాపమనీ విమర్శించారు.
గతంలో గ్రేట్ డిప్రెషన్ సమయంలో, 1971లో డాలర్ నుంచి గోల్డ్ స్టాండర్డ్ తొలగించినప్పుడు కూడా ఇలాంటి భారీ ధరల పెరుగుదల కనిపించిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పసిడి దూకుడుకు కేవలం కరెన్సీ విలువ తగ్గడమే కాకుండా.. పెరుగుతున్న జియోపాలిటికల్ ఉద్రిక్తతలు కూడా తోడవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్టర్లు ఫియాట్ కరెన్సీలను అమ్మి, వాటి స్థానంలో బంగారం వంటి హార్డ్ అసెట్స్ కొనుగోలు చేసే ధోరణినే డీబేస్మెంట్ ట్రేడ్ అంటారు.
ముఖ్యంగా రెండో విడతలో భూములిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 40,000 చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రకటించారు.  ఇది గతంలో కంటే మెరుగైన ప్యాకేజీ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
జేఎన్టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందో ళనకు గురయ్యారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
హర్మూజ్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరింది. హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
డీలిమిటేషన్ బిల్లులో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెడుతూ డీ లిమిటేషన్ బిల్లులోని ప్రతిపాదనలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిడాడు. అయితే, స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ కు రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్ సహకారాన్ని అందించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.