కేంద్రానికి తడిసి మోపెడు కానున్న ఎరువుల సబ్సిడీ భారం!

Publish Date:Mar 28, 2026

Advertisement

పశ్చిమాసియాలో నెలకొన్నయుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతలు ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భారత వ్యవసాయరంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో   ధరలు పెరుగుదల.. కేంద్రం  ఇచ్చే ఎరువల సబ్సిడీపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇది కేంద్రానికి మోయలేని భారంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని  ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ  క్రిసిల్ తాజా నివేదిక  వెల్లడించింది.  క్రిసిల్ అంచనాల మేరకు యుద్ధ ప్రభావంతో కేంద్ర ప్రభుత్వంపై అదనంగా పడే ఎరువుల సబ్సిడీ  పాతిక వేల కోట్లకు మించి ఉంటుంది. 

గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా ఎరువుల తయారీకి అవసరమైన సహజ వాయువు, అమ్మోనియా వంటి వాటి సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి.   భారత్ ఎరువుల అవసరాల కోసం, మరీ ముఖ్యంగా యూరియా తయారీకి అవసరమైన ముడి పదార్థాల కోసం పశ్చిమాసియా దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో సరఫరా అంతరాయాల కారణంగా దేశంలో ఎరువుల ఉత్పత్తి దాదాపు 15శాతం తగ్గే అవకాశం ఉంది.  వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకు తావిస్తున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో అమ్మోనియా ధరలు ఇప్పటికే దాదాపు పాతిక శాతం పెరిగాయి. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు మరి కొంత కాలం కొనసాగితే..  దేశీయ ఎరువుల కంపెనీల ఉత్పత్తి సామర్ధ్యం దాదాపుగా అడుగంటి పోతుంది. అదే సమయంలో నిర్వహణ ఖర్చులూ తడిసిమోపెడౌతాయి. ఇది కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుంది. 

అదలా ఉంటే కేంద్రం  2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ   1.71 లక్షల కోట్లు   ఎరువుల సబ్సిడీ కోసం కేటాయించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ బడ్జెట్ మరో 12 నుండి 15 శాతం పెరిగే అవకాశం ఉందన్నది  క్రిసిల్ అంచనా.  రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా చూడాలంటే, పెరిగిన అదనపు భారాన్ని కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి కేంద్రం  ఇండోనేషియా, మొరాకో, రష్యా వంటి ఇతర దేశాల నుండి దిగుమతులను పెంచుకోవడం ద్వారా కొరతను అధిగమించాలని భావిస్తోంది. ఇక  దేశీయంగా ఉన్న స్టాక్ నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా తక్షణ ముప్పును తప్పించే  ప్రయత్నాలూ ప్రారంభించింది.  

By
en-us Political News

  
ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.
కొండంత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సాయి సుదర్శన్ దురదృష్టకరమైన రీతిలో ఔటవ్వడం పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా హిట్ వికెట్ ఔట్ అవ్వడం మనం చూసే ఉంటం. కానీ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన తీరు మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండం.
ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన ఈశాన్య ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ బృందం అక్కడ లభ్యమైన బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.