బ్యాంకు మోసం కేసులో రూ.26.86 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Publish Date:Mar 6, 2026
Advertisement
బ్యాంకును మోసం చేసి కోట్లాది రూపాయల రుణాలను అక్రమంగా పొందిన కేసులో ఎన్‌ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద 26.86 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఈ కేసు సౌభాగ్య ఇస్పాత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించినదిగా అధికారులు తెలిపారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో నివాస ఫ్లాట్లు, ఒక నివాస గృహం, అలాగే ఖాళీ భూమి ప్లాట్లు ఉన్నాయి. ఈ ఆస్తులు నిందితులు బ్యాంకు మోసాల ద్వారా సంపాదించిన నేర ఆదాయంతో కొనుగోలు చేసినవిగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్ బ్రాంచ్, బెంగళూరు నమోదు చేసిన కేసులో భారతీయ దండన చట్టంలోని 120-బి (కుట్ర), 420 (మోసం), 468, 471 సెక్షన్లు మరియు అవినీతి నిరోధక చట్టం 1988లోని సంబంధిత సెక్షన్ల కింద సౌభాగ్య ఇస్పాత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు దాని డైరెక్టర్లు, ఇత రులపై కేసు నమోదైంది. వీరు అప్పటి ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ను మోసం చేసి భారీ నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడి దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం సౌభాగ్య ఇస్పాత్ ఇండియా సంస్థ స్టీల్ తయారీ యూనిట్ స్థాపన, విస్తరణ పేరుతో అప్పటి ఆంధ్రా బ్యాంక్ నుంచి టర్మ్ లోన్లు మరియు వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాలు పొందింది. అయితే సంస్థ ప్రతినిధులు నకిలీ స్టాక్ స్టేట్మెంట్లు, తప్పుడు ఆర్థిక లెక్కలు, నకిలీ పత్రాలు మరియు తప్పుడు ధృవపత్రాలు సమర్పించడం ద్వారా బ్యాంకు నుంచి అధిక రుణ పరిమితులను మోస పూరితంగా పొందినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంకు నుంచి పొందిన రుణాలను అనుమతించిన ప్రయోజనాలకు వినియో గించకుండా ఇతర మార్గా లకు మళ్లించడం (డైవర్షన్), దుర్వినియోగం చేయడం (సైఫనింగ్) కూడా జరిగి నట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత సంస్థలు మరియు ‘అకామొడేషన్ ఎంట్రీ’ అందించే నెట్‌వర్క్ ద్వారా నిధులను చలామణి చేసి, కృత్రిమ టర్నోవర్ మరియు సర్క్యులర్ లావాదేవీలను సృష్టించి సంస్థ ఆర్థిక స్థితిని కృత్రిమంగా మెరుగ్గా చూపినట్లు ఈడీ తెలిపింది. ఈ మోసపూరిత చర్యల ద్వారా సంస్థ బ్యాంకు నుంచి భారీగా రుణాలను పొందడమే కాకుండా వాటిని అక్రమంగా వినియోగించినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ కేసులో మొత్తం 46.52 కోట్ల మేర నేర ఆదాయం (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్) సృష్టించినట్లు ఈడీ గుర్తిం చింది. ఇందులో భాగంగా బ్యాంకు ఇప్పటికే 15.52 కోట్లు తిరిగి వసూలు చేసుకుంది. మిగిలిన సుమారు 31 కోట్ల నేర ఆదాయానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.పీఎంఎల్‌ఏ దర్యాప్తు సమ యంలో గుర్తించిన 26.86 కోట్ల విలువైన ఆస్తులను ప్రస్తుతం తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసా గుతోందని అధికారులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ప్రారంభమైంది.
అదేవిధంగా తప్పుడు స్టాక్ స్టేట్మెంట్లు సమర్పించడం, రిసీవబుల్స్‌ను మార్పిడి చేయడం, నకిలీ లావా దేవీలు నిర్వహించడం ద్వారా బ్యాంకులో డ్రాయింగ్ పవర్‌ను కృత్రిమంగా పెంచి అధిక క్రెడిట్ పరిమితులు పొందినట్లు దర్యాప్తులో తేలింది.
http://www.teluguone.com/news/content/ed-attaches-assets-in-bank-fraud-case-36-215129.html





