యువత అంబేద్కర్‌ని స్పూర్తిగా తీసుకొని బాగా చదువుకోండి : హరీష్ రావు

Publish Date:Apr 14, 2026

Advertisement

 

సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తడ్కపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిందని, గ్రామ ప్రవేశంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరిని ముందుగా ఆహ్వానించేది అంబేద్కర్  అవుతారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం సాయి , ఆయన కుమారుడు విగ్రహం ఏర్పాటు చేయడంపై వారిని అభినందించారు.

అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని, ఆయన అందరికీ చెందిన మహానుభావుడని హరీష్ రావు స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ఆయన గొప్పతనమని తెలిపారు.పేదరికం చదువుకు అడ్డంకి కాదని అంబేద్కర్ జీవితాన్ని చూసి యువత నేర్చుకోవాలని సూచించారు. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నప్పటికీ, దేశంలోని అణగారిన వర్గాల కోసం పోరాడి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వాగ్దానం చేసిన ఆర్థిక సహాయం అందించలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అదేవిధంగా, మాజీ సీఎం కేసీఆర్ కాలంలో విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా హరీష్ రావు విమర్శలు చేస్తూ, అంబేద్కర్ పట్ల గౌరవం చూపడం లేదని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువతకు హరీష్ రావు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు బానిసలుకాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. అంబేద్కర్ చూపించిన మార్గంలో నడుస్తూ ఉన్నత విద్యను సాధించాలని పిలుపునిచ్చారు.“వ్యసనాలకు అలవాటు అయితే జీవితాలు నాశనం అవుతాయి. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి లక్షల రూపాయలు కోల్పోవద్దు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయొద్దు” అంటూ యువతకు హరీష్ రావు సూచించారు.
 

By
en-us Political News

  
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.