పెళ్లి పేరుతో 67 మందికి వలపు వల...నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి అరెస్ట్

Publish Date:Apr 14, 2026

Advertisement

 

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారిగా తిరుగుతున్న వ్యక్తిని అసలు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో తిరుగుతూ ఫోటోలు దిగుతున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం కలిగిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిపై నిఘా పెట్టి, అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో బాలకృష్ణ సీఐఎస్ఎఫ్ అధికారిగా నటిస్తూ మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా యువతులతో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు బయటపడింది. మొదటి భార్య వదిలి వెళ్లిపోవడంతో రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను సీఐఎస్ఎఫ్ అధికారిగా నటించినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడు. అతని మొబైల్ ఫోన్ పరిశీలనలో వందలాది యువతులతో చాటింగ్ చేసిన ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని అదుపులో ఉంచి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది.

ఈ కేసులో మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణకు ఇప్పటికే పెళ్లై ఒక కుమార్తె ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పెళ్లికి ముందు మరో యువతితో ప్రేమ సంబంధం ఉన్న అతడు, ఆ యువతి ఇటీవల విడాకులు తీసుకున్న నేపథ్యంలో మళ్లీ ఆమెను సంప్రదించాడు. “మనిద్దరం పెళ్లి చేసుకుందాం” అని ఒత్తిడి చేయగా, ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారని యువతి చెప్పింది.

దీంతో తాను సీఐఎస్ఎఫ్‌లో చేరి ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నానని అబద్ధం చెప్పాడు. తన మాట నమ్మించే ప్రయత్నంలో భాగంగా సీఐఎస్ఎఫ్ యూనిఫామ్ కొనుగోలు చేసి, దానిని ధరించి ఎయిర్‌పోర్ట్‌లో ఫోటోలు దిగాడు. ఆ ఫోటోలను యువతికి పంపే సమయంలోనే భద్రతా సిబ్బందికి అనుమానం రావడంతో అతడు పట్టుబడ్డాడు. ఇదే తరహాలో మ్యాట్రిమోని వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనేక మంది యువతులతో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 60 మందికి పైగా మహిళలు, యువతులను మోసం చేసినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

By
en-us Political News

  
ప్రపంచం ఎంత పెద్దదైనా, దాన్ని నిలిపివేయడానికి కొన్ని కిలోమీటర్ల సన్నని సముద్ర మార్గమే చాలనేది నేటి జియోపాలిటిక్స్ చెబుతోంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం కంటే ఎక్కువ భాగం సముద్ర మార్గాల ద్వారా జరుగుతోంది. అందులో కూడా అత్యంత కీలకమైన చమురు, సహజవాయువు, గోధుమలు, ఎలక్ట్రానిక్స్, కంటైనర్లు కొన్ని చోక్ పాయింట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా రిజర్వేషన్ల అమలు ఒక చారిత్రక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ వ్యూహాత్మక మార్పులో ఒక కీలక మైలురాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభింస్తుంది. దీనివల్ల మలక్కా జలసంధి గుండా సాగే నౌకాయానాన్ని నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం అమెరికాకు పెరుగుతుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆంక్షలు విధించి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా, ఇప్పుడు అదే తరహా ఒత్తిడిని చైనాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పై ఒత్తిడి పెంచిన తర్వాత, ఇప్పుడు అమెరికా దృష్టి మలక్కా జలసంధి వైపు మళ్లింది. ఇది చైనా ఎనర్జీ భద్రతకు అత్యంత కీలకమైన మార్గం. ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న కొత్త రక్షణ ఒప్పందం, ఈ వ్యూహాత్మక మార్పుకు ప్రధాన సూచికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
లోకేష్‌ కన్నా అర్హులెవరు? ఏపీ భావి ముఖ్యమంత్రి ఆయనే.. వర్మ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ ఐటీ సంస్థలైన టీసీఎస్ కోల్ ‌కతా, టెక్ మహీంద్రా గోరేగావ్, హుబ్లీలోని ఇన్ఫోసిస్ కార్యాలయాల్లో పక్షపాత ధోరణులు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రార్థన సమయాల్లో వెసులుబాటు, సెలవుల మంజూరు, మతపరమైన చిహ్నాల ధారణ వంటి విషయాల్లో అసమాన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. గుర్గావ్ లోని విప్రో, హైదరాబాద్ లోని ఎల్ అండ్ టీ వంటి సంస్థల ఉద్యోగుల నుంచి కూడా దాదాపు ఇలాంటి పోస్టులే దర్శనమిస్తున్నాయి.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ ఉద్దేశాలపై అనుమానం వ్యక్తం చేసింది. ఓఆర్‌ఆర్‌ ఎక్కడ నిర్మించాలో ఒక రైతు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తూ.. ఇటీవల కాలంలో చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ దురుద్దేశాల దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన ఈ పిటిషన్ కూడా అలాంటిదేనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వీడియోలో పునరుద్ఘాటించారు. తనపై ఇంత పెద్ద అభియోగం రావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలకు పూర్తిగా సహకరిస్తానన్న మంగ్లీ, ఈ ఫైనాన్స్ చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదానికి తనకూ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
వర్క్ ప్లేస్ సమానత్వం అన్నది ఒక కంపెనీ సమస్య కాదు, దేశ భవిష్యత్తు ఈ ఆరోపణలు నిర్ధారించని వాంగ్మూలాలు అయినప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు.
నవ్వుతూ ఆపరేషన్ థియోటర్ కువెళ్లిన హారిక మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగపోయారు. ఆపరేషన్ వికటించి హారిక మరణించిందని వైద్యులు చెప్పారు.
తంలోలా కాకుండా, ఈసారి ప్రజలకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అనే వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. గురువారం నుండి ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.