చీరకట్టులో ఇద్దరు మహిళల స్నో బోర్డింగ్

Publish Date:Mar 6, 2026

Advertisement

 

చీరకట్టులో ఇద్దరు మహిళలు స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.  నేటి జమానాలో మహిళలు ఉద్యోగవ్యాపార రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మహిళలు దుస్తులను ఎంచుకుంటున్నారు. పని ప్రదేశాల్లో తమకు అనుకూలంగా ఉండే వస్త్రధారణ వైపు మొగ్గు చూపుతున్నారు. చీరలు, ఇతర సంప్రదాయ వస్త్రాలను పండుగలు, లేదా ప్రత్యేక సందర్భాల్లోనే ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చీరలు ధరించిన ఇద్దరు మహిళలు ఏకంగా స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 

ఓ భారతీయురాలు మరో విదేశీ మహిళతో కలిసి చేసిన ఈ సాహనం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, చీరలు కట్టుకున్న ఇద్దరు మహిళ స్నోబోర్డింగ్ చేశారు. స్నో బోర్డు సాయంతో మంచు పర్వతంపై నుంచి కిందకు దూసుకెళుతూ అబ్బురపరిచే రీతిలో విన్యాసాలు చేశారు. చీరలు ధరించిన వారు ఇలాంటి సాహస క్రీడల్లో కూడా పాల్గొనవచ్చని రుజువు చేశారు. ఇక ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

సంప్రదాయక వస్త్రధారణను ఇష్టపడే మహిళలందరి ముఖాల్లో ఈ వీడియో నవ్వులు పూయిస్తుందని అనేక మంది కామెంట్ చేశారు. ఆధునికతకు సంప్రదాయకతను అద్భుతంగా జోడించారంటూ వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారని మరికొందరు ప్రశ్నించారు. కొందరు మాత్రం వారు హెల్మెట్ పెట్టుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసక్రీడల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని హితవు పలికారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ తెలియకపోయినప్పటికీ వీడియోకు మాత్రం జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.

 

 

 

 

https://www.youtube.com/shorts/V9zs0hQP3D4

By
en-us Political News

  
అసెంబ్లీ ఎన్నికల సమరం.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఈవీఎంలు, భద్రత కట్టుదిట్టం
రెంటు కట్టని వైనం.. కోహ్లీ వన్8 కమ్యూన్‌కు తాళాలు
హైదరాబాద్ మహానగరంలో వస్తువుల డెలివరీ విధానం పూర్తిగా మారబోతోంది.
ప్రస్తుత ఏడాది 2026 తొలి త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఊహించని మందగమనాన్ని నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారానికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని కేసీఆర్ అన్నారు.
మోహన్ భాగవత్‌కు కల్పించిన జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రతను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముంబైలో నడి రోడ్డుపై మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీశ్‌మహాజన్‌పై ఒక విద్యావంతురాలైన తల్లి మండిపడ్డ తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
బాణాసంచా తయారీ కేంద్రాలు ..మృత్యు కుహరాలుగా మారుతున్నాయి.
ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలిలో భారతీయ పర్యాటకులు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి ఏడాది పూర్తయింది.
కడప నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.