డాలర్ యుగానికి అంతమెప్పుడంటే?

Publish Date:Apr 14, 2026

Advertisement

కంఠమనేని సీతారాం

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న అమెరికా డాలర్ ఆధిపత్యానికి నెమ్మదిగా.. కాదు కాదు వేగంగానే బీటలు వారుతున్నాయి.  ప్రపంచ దేశాల మధ్య మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక వ్యూహాల నేపథ్యంలో ఇప్పుడు  డీ-డాలరైజేషన్ అన్నది ప్రధాన చర్చగా మారింది. ప్రధానంగా  అంతర్జాతీయ లావాదేవీల్లో ఒకే కరెన్సీపై ఆధారపడటం వల్ల తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి పలు దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. 

ఇటీవల అమెరికా విదేశాంగ వర్గాల నుంచి వచ్చిన కీలక వ్యాఖ్యలు ఈ అంశంపై మరింత చర్చల వేడిని మరింత పెరిగేలా చేశాయి.  అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో డాలర్ భవిష్యత్తుపై చేసిన విశ్లేషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బ్రెజిల్, చైనా వంటి   దేశాలు తమ పరస్పర వాణిజ్యం కోసం డాలర్‌ను పక్కన పెట్టి, సొంత కరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి గనుక మరో ఐదేళ్ల పాటు కొనసాగితే.. ప్రపంచ దేశాలకు అమెరికా డాలర్‌తో అవసరం తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది. అదే సమయంలో అమెరికా తన విధానాలను మార్చుకోవాలన్న హెచ్చరికా ఆయన వ్యాఖ్యలో ఉంది. అదే జరిగితే.. అంటే డాలర్ ప్రాధాన్యత తగ్గితే..  ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అమెరికా శక్తి   గణనీయంగా తగ్గిపోతుందని ఆయన అన్యాపదేశంగా హెచ్చరిక చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసలు డీ-డాలరైజేషన్ అంటే ఏమిటంటే..  అంతర్జాతీయ వ్యాపార లావాదేవీల్లో అమెరికన్ డాలర్ వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ, దాని స్థానంలో ఇతర దేశాల కరెన్సీలను లేదా నూతన  చెల్లింపు వ్యవస్థలను ప్రవేశపెట్టడం. ఇది కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన భౌగోళిక, రాజకీయ వ్యూహాలు  ఉన్నాయి.  ఒకే కరెన్సీపై ఆధారపడటం వల్ల ఆ దేశం విధించే ఆంక్షలకు ఇతర దేశాలు బలికాకూడదనే ఉద్దేశంతో ఈ మార్పు మొదలైంది. ఈ మార్పులో బ్రిక్స్ దేశాలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.  రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత..  ఆ దేశం ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలపై దృష్టి సారించింది. అటు చైనా కూడా తన  యువాన్ కరెన్సీని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ సైతం ఈ దిశగా  అడుగులు వేస్తున్నది.  ఇప్పటికే రష్యాతో చమురు వాణిజ్యంలో రూపాయిని వినియోగించడమే కాకుండా.. దాదాపు 20కి పైగా దేశాలతో రూపాయిలోనే వాణిజ్య లావాదేవీలు జరిపేలా ఒప్పందాలు కుదుర్చుకుంది.

 అదలా ఉంటే ఇప్పటికిప్పుడు డాలర్ కు కానీ, అమెరికా ఆధిపత్యానికి కానీ వచ్చే ముప్పేమీ లేదు.  ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ హవా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ మారక నిల్వల్లో దాదాపు 57 శాతం వాటా డాలర్‌దే. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యధిక భాగం ఇప్పటికీ డాలర్  ద్వారానే జరుగుతోంది. కాబట్టి, డాలర్ ఆధిపత్యం ఒక్కరోజులో అంతరించిపోతుందని భావించడం పొరపాటే అవుతుంది.  అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉన్న బలం, అక్కడి మార్కెట్ల లోతు కారణంగా డాలర్ ఇంకా కీలకంగానే ఉంది. అయితే ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో అది ఏకఛత్రాధిపత్యం కాకుండా, ఇతర బలమైన కరెన్సీలతో కలిసి సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.   ప్రపంచం 'మల్టీ-కరెన్సీ' వ్యవస్థ వైపు అడుగులు వేయబోతోంది. అంటే డాలర్‌తో పాటు యువాన్, యూరో, రూపాయి వంటి కరెన్సీలు సమాంతరంగా చెల్లింపుల్లో భాగస్వామ్యం వహిస్తాయి. 

ఒకవేళ దేశాలు సొంతంగా సురక్షితమైన చెల్లింపు వ్యవస్థలను నిర్మించుకుంటే, అగ్రరాజ్యం అమెరికా ప్రభావం ప్రపంచ రాజకీయాలపై తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యుద్ధాలు లేదా వివాదాల సమయంలో అమెరికా ఆయుధంగా వాడే ఆర్థిక ఆంక్షల ప్రభావం భవిష్యత్తులో నీరుగారిపోవచ్చు. 

మొత్తంగా చూస్తే, డీ-డాలరైజేషన్ అనేది ఒక బలమైన ట్రెండ్‌గా మొదలైంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అత్యంత సంక్లిష్టమైనది కావడంతో, ఏదైనా పెద్ద మార్పు సంభవించాలంటే దానికి విశ్వసనీయత, స్థిరత్వం చాలా ముఖ్యం. ఈ విషయంలో ప్రస్తుతం అమెరికాకు ఉన్న అనుభవం, ఆ దేశంపై ఉన్న నమ్మకం ఇతర దేశాలకు అందడానికి కొంత సమయం పట్టవచ్చు. ప్రపంచం నెమ్మదిగా ఒకే కరెన్సీపై ఆధారపడే స్థితి నుంచి బహుళ కరెన్సీ వ్యవస్థ వైపు మారుతున్న తరుణమిది.  చివరగా, డాలర్ పూర్తిగా ముగిసిపోతుందా అనే దానికంటే, దాని పాత్ర ఏ మేరకు పరిమితం కాబోతుందనేదే అసలైన ప్రశ్న. భవిష్యత్తులో ప్రపంచం మరింత సమతుల్యమైన ఆర్థిక వ్యవస్థను చూడబోతోంది. విభిన్న దేశాల కరెన్సీలకు సమాన గౌరవం దక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. డాలర్ యుగం ఇంకా అంతం కాకపోయినా, డీ-డాలరైజేషన్ ప్రక్రియ మాత్రం వేగంగానే ముందుకు సాగుతోంది. 

By
en-us Political News

  
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిణామాల మధ్య, ఇరాన్‌తో నేరుగా లేదా పరోక్షంగా చర్చలు జరపడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని అమెరికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గెలుస్తామో లేదో తెలియని యుద్ధాన్ని కొనసాగించేకంటే.. ఏదో ఒకలా ఏదో మేరకు శాంతి కుదిరితే అదే పదివేలన్న భావనలో అమెరికా ఉందన్న చర్చ అంతర్జాతీయ రాజకీయ వేదికలపై జోరుగా సాగుతున్నది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనే ధ్యేయంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్ పథకం.. ఇప్పుడు లక్షలాది మంది ఆకలి తీరుస్తూ ఒక సామాజిక విప్లవంగా మారింది.
వచ్చే 5 సంవత్సరాల్లో అనేక దేశాలు డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. అదే కనుక జరిగితే.. అమెరికా ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే శక్తి గణనీయంగా తగ్గిపోతుంది.
గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సుదీర్ఘంగా మూడు నెలల పాటు పరిశీలించి, అది తప్పుడు కేసు అని తేల్చిచెప్పిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించగానే కేవలం తొలి రోజే ఆ తీర్పును పక్కనపెట్టేలా జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యవహరించారని ఆరోపించారు. కేవలం మూడు విచారణలతోనే నిందితులందరినీ అవినీతిపరులుగా ముద్ర వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.
ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండి, ఆర్థికంగా వెనుకబడిన లేదా సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విధుల్లో చేరకముందే ఈ బాధితులను గుర్తించి, ఒక పద్ధతి ప్రకారం వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.