మనం ఏమి చేయకపోయినా సరే.. ఆదాయం తెచ్చిపెట్టే సంపాదనా మార్గాలు ఇవి..!

Publish Date:Sep 25, 2026

Advertisement

మనం ఏమి చేయకపోయినా సరే.. ఆదాయం తెచ్చిపెట్టే సంపాదనా మార్గాలు ఇవి..!

ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వస్తాయి అనేది పాత మాట. కానీ ఎలాంటి శారీరక శ్రమ లేకుండా, రోజూ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా సరే మన ఖాతాలోకి డబ్బులు వచ్చే మార్గాలు కూడా ఉన్నాయి. దాన్నే నిష్క్రియాత్మక ఆదాయం లేదా ప్యాసివ్ ఇన్‌కమ్ అని అంటారు. మనం నిద్రపోతున్నా, వేరే పనుల్లో బిజీగా ఉన్నా లేదా కుటుంబంతో గడుపుతున్నా ఈ మార్గాలు మనకు నిరంతరం ఆదాయాన్ని తెచ్చిపెడతాయి.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో కేవలం ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడటం అంత క్షేమకరం కాదు. అందుకే ప్రత్యామ్నాయ సంపాదన మార్గాలను అన్వేషించడం చాలా అవసరం. సరైన ప్రణాళిక, చిన్నపాటి పెట్టుబడి లేదా నైపుణ్యంతో  కొన్ని ప్యాసివ్ ఇన్‌కమ్ మార్గాలు ప్రారంభించవచ్చు.  వీటి వల్ల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది.  మనం ప్రత్యక్షంగా పనిచేయకపోయినా ఆదాయం తెచ్చిపెట్టే కొన్ని ముఖ్యమైన ఆదాయ  మార్గాల గురించి వివరంగా తెలుసుకుంటే..
 
రియల్ ఎస్టేట్ రెంట్  లేదా అద్దె ద్వారా ఆదాయం..

సొంతంగా ఇల్లు,  వాణిజ్య సముదాయాలు లేదా ఖాళీ స్థలాలు ఉంటే వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతినెల స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ప్రాపర్టీని ఒక్కసారి సిద్ధం చేసి అద్దెకు ఇస్తే చాలు, ప్రతి నెల ఆటోమేటిక్‌గా అద్దె రూపంలో డబ్బులు వస్తాయి.

డివిడెండ్ స్టాక్స్ , మ్యూచువల్ ఫండ్స్..

మంచి పనితీరు కనబరిచే కంపెనీల షేర్లలో లేదా డివిడెండ్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందవచ్చు. ఈ కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో క్రమం తప్పకుండా అందిస్తాయి.

డిజిటల్ ప్రోడక్ట్స్, ఈ-బుక్స్..

ఏదైనా ప్రత్యేకమైన నైపుణ్యం లేదా పరిజ్ఞానం ఉంటే దానిపై పుస్తకాలు రాయడం లేదా కోర్సులు తయారు చేయడం చేయవచ్చు. ఈ-బుక్స్, ఆన్‌లైన్ గైడ్స్ లేదా వీడియో కోర్సులను ఒక్కసారి క్రియేట్ చేసి ఇంటర్నెట్‌లో విక్రయానికి పెడితే, ఎన్నిసార్లు అమ్మడుపోతే అన్నిసార్లు  రాయల్టీ లేదా ఆదాయం వస్తుంది.

యూట్యూబ్ ఛానెల్ , బ్లాగింగ్..

 ఆసక్తి ఉన్న అంశాలపై వీడియోలు చేయడం లేదా వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ రాయడం ద్వారా కూడా  మంచి  ఆదాయం పొందవచ్చు. ఒక్కసారి కంటెంట్ తయారు చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత, ఆ వీడియోలు లేదా వ్యాసాలను జనాలు చూస్తున్నంత కాలం యాడ్స్ ద్వారా లేదా ప్రమోషన్ల ద్వారా ఆదాయం వస్తూనే ఉంటుంది.

అఫిలియేట్ మార్కెటింగ్..

ఇతర కంపెనీల ఉత్పత్తులు లేదా సేవలను  సోషల్ మీడియా అకౌంట్స్ , వెబ్‌సైట్ లేదా యూట్యూబ్ ద్వారా ప్రమోషన్  చేయడం దీని ప్రత్యేకత. మీ లింక్ ద్వారా ఎవరైనా ఆ వస్తువులను కొనుగోలు చేస్తే మీకు నిర్దిష్ట శాతం కమిషన్ లభిస్తుంది.

బ్యాంక్ డిపాజిట్లు , ప్రభుత్వ బాండ్లు..

ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన ఆదాయం కోరుకునే వారికి ఇది మంచి మార్గం. ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ప్రభుత్వ బాండ్లలో డబ్బు జమ చేయడం ద్వారా ప్రతి నెల లేదా ఏడాదికి ఒకసారి క్రమం తప్పకుండా వడ్డీ రూపంలో ఆదాయం పొందే వీలుంది.

మొదట్లో ఈ మార్గాలను ఏర్పాటు చేసుకోవడానికి కొంత సమయం, శ్రమ లేదా పెట్టుబడి అవసరమవుతాయి. కానీ ఒక్కసారి సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే  ఆ తర్వాత మనం పెద్దగా సమయం కేటాయించకపోయినా ఆర్థికంగా స్థిరమైన ఆదాయాన్ని పొందడానికి ఇవి ఎంతో దోహదపడతాయి.

                                                                                                                                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
విటమిన్ B12 లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, అలసట, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయా? ఈ పోషక లోపం లక్షణాలు, కారణాలు మరియు తీసుకోవాల్సిన ఆహారాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే 5 సులువైన ఇంటి చిట్కాలు మరియు జాగ్రత్తల పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఉదయం పూట ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, బరువు తగ్గడానికి దీన్ని ఎలా త్రాగాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
బాదం, పిస్తా కంటే తక్కువ ధరలో లభించే వేరుశనగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. చలికాలంలో రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బరువు నియంత్రణ మరియు పోషక వివరాల పూర్తి సమాచారం.
చెవి నొప్పి మరియు గ్రేడ్ 2 టింపానిక్ మెంబ్రేన్ రిట్రాక్షన్ సమస్యతో బాధపడుతున్నారా? ఆయుర్వేద నిపుణుల సలహాలు, షడ్బిందు తైలం నస్య కర్మ, గృహ చికిత్సలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం తెలుసుకోండి.
ఉడికించిన గుడ్లు వర్సెస్ ఫ్రైడ్ ఎగ్స్.. ఏ పద్ధతిలో వండుకుంటే శరీరానికి ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది? బరువు తగ్గడానికి ఏది మంచిది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యూరప్‌లో ఒక చిన్నారి నేర్పిన జీవిత పాఠం! గెలుపుతో పాటు ఓటమిని, వద్దు అనే తిరస్కారాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిపే అద్భుతమైన స్ఫూర్తిదాయక వెబ్ స్టోరీ కథనం.
మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
షుగర్ పేషెంట్లు రాత్రి పూట డిన్నర్ లోకి రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు కార్బోహైడ్రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.