Publish Date:Apr 24, 2026
ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో.. డేటా సెంటర్ల నిర్వహణలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. 300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే భారీ డేటా సెంటర్లకు సొంతంగా విద్యుత్ పంపిణీ చేసుకునే హక్కును కల్పిస్తూ డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ (డీడీఎల్) విధానాన్ని తీసుకువచ్చారు. దీనివల్ల భారీ సంస్థలు ఇకపై ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్ లపై ఆధారపడకుండా.. నేరుగా విద్యుత్ కొనుగోలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఈ కొత్త విధానం మేరకు.. అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా, సరఫరాలో నాణ్యత పెరుగుతుంది.
పర్యావరణ హితానికి ప్రాధాన్యతనిస్తూ, ఈ విధానంలో ఒక కీలక నిబంధనను చేర్చారు. ఈ లైసెన్స్ పొందే సంస్థలు తమ మొత్తం విద్యుత్ వినియోగంలో కనీసం 51 శాతం పునరుత్పాదక ఇంధనం నుండే పొందాల్సి ఉంటుంది. సౌర లేదా పవన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా అటు పరిశ్రమలకు, ఇటు పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ, ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న భారీ ఏఐ హబ్, డేటా సెంటర్ క్లస్టర్‌కు ఈ లైసెన్స్ లభించే అవకాశం ఉంది. విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ డీడీఎల్ విధానం దోహదపడుతుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ డిస్కమ్ లకు రాబడి తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కేవలం 300 మెగావాట్ల కంటే ఎక్కువ లోడ్ ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులకు మాత్రమే ఈ వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు యధావిధిగా డిస్కంల నుండే విద్యుత్ పొందాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ సంస్థల ఆదాయానికి పెద్దగా గండి పడకుండా, అంతర్జాతీయ పెట్టుబడులను సాధించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ddl-policy-for-largescale-data-centers-36-218177.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.