Publish Date:Apr 18, 2026
రెండో విడత భూసమీకరణపై తొలగిన అనిశ్చితి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియకోసం భూములిచ్చిన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అండగా నిలిచారు. రాజధాని ప్రాంత అభివృద్ధిలో కీలక భాగస్వాములైన రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ఆయన తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిధిలోని 10 గ్రామాల రైతులతో శనివారం (ఏప్రిల్ 18) ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రెండో విడత భూ సమీకరణ ప్రక్రియపై ఈ భేటీలో చంద్రబాబు రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం.. వారికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ముఖ్యంగా రెండో విడతలో భూములిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 40,000 చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రకటించారు. ఇది గతంలో కంటే మెరుగైన ప్యాకేజీ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వ్యవసాయ రుణమాఫీ చేస్తామన్నారు.
ఒక్కో రైతు కుటుంబానికి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకూ రుణాలను మాఫీ చేసేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతులకు అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యతన్న ఆయన.. ప్రతి ఏటా కౌలు మొత్తాన్ని రూ. 3,000 చొప్పున పెంచేందుకు అంగీకరించారు. ధరల పెరుగుదల, రైతుల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ పెంపుదల వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల వల్ల పది గ్రామాల పరిధిలోని వందలాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-meets-with-capital-region-farmers-36-217640.html
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.