ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

Publish Date:Apr 18, 2026

Advertisement

హైదరాబాద్  కూకట్‌పల్లి ప్రాంతంలో  శుక్రవారం (ఏప్రిల్ 17) రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  కూకట్‌పల్లి నుంచి పాలకొల్లు వెళ్లాల్సిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మా త్తుగా మంటలు చెలరే గాయి. ఈ ఘటన మెట్రో పిల్లర్ నంబర్ 734 సమీపంలో, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జాతీయ రహ దారిపై జరిగింది. జేఎన్టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందో ళనకు గురయ్యారు.

ఘటన జరిగిన  సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.  బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా దింపేయడంతో ప్రణనష్టం తప్పింది. ప్రయాణికులు తమ లగేజీతో  సహ సురక్షితంగా బయటకు వచ్చారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక  సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

కానీ అప్పటికే బస్సు మంటల్లో దగ్దం అయింది.  షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన జరగడంతో   భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అతి కష్టం మీద అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను క్లీయర్ చేశారు.  

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారానికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని కేసీఆర్ అన్నారు.
మోహన్ భాగవత్‌కు కల్పించిన జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రతను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముంబైలో నడి రోడ్డుపై మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీశ్‌మహాజన్‌పై ఒక విద్యావంతురాలైన తల్లి మండిపడ్డ తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
బాణాసంచా తయారీ కేంద్రాలు ..మృత్యు కుహరాలుగా మారుతున్నాయి.
ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలిలో భారతీయ పర్యాటకులు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి ఏడాది పూర్తయింది.
కడప నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఈ హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనంతబాబు.. తాజాగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. సాక్షులను భయపెట్టి, డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాకుండా.. ఇప్పుడు ఆ ప్రయత్నం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేపాల్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపు విధానంలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
తన రాజకీయ చతురతతో, దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు కథను సెల్యులాయిడ్ పై చూడటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రగతి దీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే దేశీయంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొన్నేళ్లుగా భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున 7.7 శాతంగా నమోదవుతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా 4.6 శాతం వృద్ధి వద్ద ఆగిపోగా, ఇతర వర్ధమాన దేశాలు 3.4 శాతానికే పరిమితమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.