శుభ్ మన్ గిల్ కెప్టెన్స్ ఇన్నింగ్స్.. కేకేఆర్ పై జీటీ గెలుపు

Publish Date:Apr 17, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 17) జరిగిన ఉత్కంఠ పోరులో  గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. . కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్స్ నాక్ కారణంగానే గుజరాత్ టైటాన్స్ మరో  రెండు బంతులు మిగిలి ఉండగానే  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.   

టాస్ గెలిచి తొలుత  బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిడాడు.  అయితే, స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్  55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసి జట్టును  ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ కు  రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్  సహకారాన్ని అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 180 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ   3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్  2 వికెట్లు తీశారు. 

ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ (22) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ ఆరంభం నుంచే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జోస్ బట్లర్ (25) కూడా కాసేపు మెరుపులు మెరిపించాడు. గిల్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువగా తీసుకువెళ్లాడు. అయితే గిల్ ఔట్ అయిన తరువాత గుజరాత్ టైటాన్స్ కు పరుగులు రావడం కష్టంగా మారింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. చివరకు 10.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.   

By
en-us Political News

  
దాదాపు ఓటమి అంచుల్లో ఉన్న స్థితి నుండి కోలుకుని ఆరెంజ్ ఆర్మీ అద్భుత విజయం సాధించింది. ఇంత వరకూ సన్ రైజన్ బౌలింగ్ విభాగంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఆఖరి ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని అందించారు.
హైదరాబాద్ నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
కాంగ్రెస్, డీఎంకే, వాటి మిత్ర పక్షాలు నీచ రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో అడ్డుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసే చిన్న చిన్న పనులు కూడా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోలీసులు నగరం మొత్తం ఒకేసారి తనిఖీలు నిర్వహించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్ వెలువడింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో దిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది.
నటి ఖుష్బూ సుందర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలను వేధిస్తున్న లేఆఫ్స్ పర్వం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
అత్తాపూర్ ఆర్డీవో కొప్పుల వెంకట్ రెడ్డికి జైలు శిక్ష విధించిన తెలంగాణ హై కోర్టు
యాంకర్ విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పేరు! ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా, సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఆమె సంపాదిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల పరిస్థితిపై చర్చ జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.